TSRTC Strike : సునీల్ శర్మ కమిటీతో కేసీఆర్ కీలక భేటీ.. ఏం డిసైడ్ చేయబోతున్నారు?

TSRTC Strike : సోమవారం మధ్యాహ్నం సునీల్ శర్మ కమిటీతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో కొత్త ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన విధి విధానాలు.. నోటిఫికేషన్‌పై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 7, 2019, 1:23 PM IST
TSRTC Strike : సునీల్ శర్మ కమిటీతో కేసీఆర్ కీలక భేటీ.. ఏం డిసైడ్ చేయబోతున్నారు?
సీఎం కేసీఆర్ (File Photo)
news18-telugu
Updated: October 7, 2019, 1:23 PM IST
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. విధుల్లో చేరని కార్మికులందరినీ డిస్మిస్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎక్కడికక్కడ ధర్నాలు,నిరసనలతో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోమారు సమీక్ష సిద్దమయ్యారు. సోమవారం మధ్యాహ్నం సునీల్ శర్మ కమిటీతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో కొత్త ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన విధి విధానాలు.. నోటిఫికేషన్‌పై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 50శాతం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆర్టీసీని నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో..దానికి సంబంధించిన సూచనలు సునీల్ శర్మ కమిటీ సీఎంకు వివరించనుంది. ఏయే రూట్లలో ప్రైవేట్ బస్సులకు అనుమతినివ్వాలనే దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆదివారం ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేసే అవకాశం ఏమైనా ఉందా..? అన్న చర్చ కూడా జరుగుతోంది. సాయంత్రం లోపు ఈ భేటీ వివరాలు బయటకురానున్నాయి.

మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్మికవర్గాల్లో అగ్గి రాజేసింది. ప్రతిపక్షాలు కూడా ఆర్టీసీ ధర్నాలు,నిరసనల్లో పాలుపంచుకుంటున్నాయి.పలువురు మేదావులు,ప్రజాస్వామిక వాదులు కూడా సోషల్ మీడియాలో కేసీఆర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అయితే కొంతమంది మాత్రం కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తుండటం కూడా గమనార్హం. ఏదేమైనా అటు ప్రభుత్వం,ఇటు ఆర్టీసీ రెండు ఢీ అంటే ఢీ అన్న తరహాలో వ్యవహరిస్తుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నపళంగా వేలమంది ఉద్యోగులను తొలగిస్తే వాళ్ల భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ వ్యతిరేకతను కొనితెచ్చుకుంటున్నారా? అన్న చర్చ జోరందుకుంది. కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీగా సాగుతున్న ఈ ఫైట్ మున్ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.

First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...