ప్రభుత్వ స్కూళ్ల మూసివేత.. కేసీఆర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు

స్వతంత్ర భారతంలో స్కూళ్లను మూసివేసేందుకు కృషిచేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వంగా కేసీఆర్ సర్కార్ రికార్డు సృష్టించిందని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు లక్ష్మణ్.

news18-telugu
Updated: November 27, 2019, 9:16 PM IST
ప్రభుత్వ స్కూళ్ల మూసివేత.. కేసీఆర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు
సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర లక్ష్మణ్(File Photo)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకే సర్కారీ బడులను మూసివేస్తున్నారని విమర్శలు గుప్పించారు. స్వతంత్ర భారతంలో స్కూళ్లను మూసివేసేందుకు కృషిచేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వంగా కేసీఆర్ సర్కార్ రికార్డు సృష్టించిందని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు లక్ష్మణ్. టీఆర్ఎస్ ప్రభుత్వం బడులను మూస్తూ బార్లను తెరుస్తోందంటూ విరుచుకుపడ్డారు.

ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకు టీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తుంది. దాదాపు 12వేల స్కూళ్లను మూసివేయాలను ఆలోచిస్తోంది. ఇలా మూసివేస్తున్న పాఠశాలల్లో 70శాతం గ్రామీణ ప్రాంతాల్లోనివే.
లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>