హోమ్ /వార్తలు /తెలంగాణ /

జగిత్యాల TRS కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్..వైద్య కళాశాలకు భూమి పూజ

జగిత్యాల TRS కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్..వైద్య కళాశాలకు భూమి పూజ

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాకు చేరుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్  (Cm Kcr) అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వైద్య కళాశాలకు చేరుకున్న కేసీఆర్  (Cm Kcr) సొంత స్థలానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్  (Cm Kcr) వెంట మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Jagtial

తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాకు చేరుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్  (Cm Kcr) అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వైద్య కళాశాలకు చేరుకున్న కేసీఆర్  (Cm Kcr) సొంత స్థలానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్  (Cm Kcr) వెంట మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana: ఆదిత్య 369 చూశారా? అచ్చం అలానే.. వికారాబాద్‌లో దిగిన వింత వస్తువు.. అసలేంటిది..?

ఈ పర్యటనలో భాగంగా కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించిన కేసీఆర్ జగిత్యాల కలెక్టర్ రవికి శాలువా కప్పి సీట్ లో కూర్చోబెట్టారు. అంతకుముందు జగిత్యాలకు చేరుకున్న సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇక ఆ తరువాత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అధికారుల పాత్ర ఎంతగానో ఉంది. అందుకే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అధికారులకు అత్యధిక జీతాలు ఇస్తున్నట్టు తెలిపారు.

రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ యత్నం..కూనంనేని, చాడ అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

పంటను కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ..

పండిన పంటను కొనే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలిచిందన్నారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా కూడా సాగుకు సాయం చేసి పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇక 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణనే అని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో బడ్జెట్ 62 వేల లక్షల కోట్లు దానిని ఇప్పుడు 2 లక్షల కోట్లకు పెంచుకున్నామని కేసీఆర్ తెలిపారు. GST, తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేసీఆర్ తెలిపారు.

మిషన్ భగీరథ అద్భుత పథకం..

ఇక మేము 2024 నాటికి ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని అన్నం. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో  2లక్షల కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైపులు ఉన్నాయి. ప్రతీ ఇంటికి కూడా నీరు అందిస్తున్నామని తెలిపారు. ఇక మోతె శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభలో జిల్లాపై గులాబీ బాస్ ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలి.

First published:

Tags: CM KCR, Telangana

ఉత్తమ కథలు