Home /News /telangana /

KCR GOVT TO OPEN 288 NEW BASTI DAWAKHANAS IN OTHER MUNICIPALITIES IN TELANGANA SAYS MINISTER KTR HARISH RAO MKS

basti dawakhana : ఇక రాష్ట్రమంతా బస్తీ దవాఖానలు.. 141 మున్సిపాలిటీల్లో కొత్తగా 288.. జూన్2లోపే ఓపెనింగ్

బస్తీ దవాఖానలపై మంత్రులు

బస్తీ దవాఖానలపై మంత్రులు

హైదరాబాద్ పరిధిలో ఏర్పాటైన అన్నిటికి అన్ని బస్తీ దవాఖానలకు రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వాటి సేవలు విస్తృతం అవుతూ వచ్చాయి. కాగా, ఇన్నాళ్లూ జీహెచ్ఎంసీ వరకే పరిమితమైన ఈ గల్లీ ఆస్పత్రులు ఇక తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ప్రకటన చేశారు.

ఇంకా చదవండి ...
ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువచేసే క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో సూపర్ హిట్ అయిన ‘మొహల్లా క్లినిక్’ మోడల్ లో కేసీఆర్ సర్కారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ‘బస్తీ దవాఖాన’లకు కూడా గొప్ప ఆదరణ లభించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఏర్పాటైన అన్నిటికి అన్ని బస్తీ దవాఖానలకు రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వాటి సేవలు విస్తృతం అవుతూ వచ్చాయి. కాగా, ఇన్నాళ్లూ జీహెచ్ఎంసీ వరకే పరిమితమైన ఈ గల్లీ ఆస్పత్రులు ఇక తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ప్రకటన చేశారు. వివరాలివి..

జీహెచ్‌ఎంసీ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2 నాటికి 141 మున్సిపాలిటీల్లో రెండు దశల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన మౌలిక సదుపాయాలను పురపాలకశాఖ, వైద్య పరికరాలను వైద్యశాఖ, సాంకేతిక సహకారాన్ని ఐటీ శాఖ సమకూర్చనున్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కలిసి బస్తీ దవాఖానల ఏర్పాటుపై మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు.

Lockdown : మరిన్ని నగరాల్లో కఠిన లాక్‌డౌన్.. సరుకులు దొరక్క జనం ఆకలి కేకలు.. ఇదీ తాజా సీన్



సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు జీహెచ్‌ఎంసీలో నెలకొల్పిన 256 బస్తీ దవాఖానలు పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతో పాటు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కొత్తగా నెలకొల్పనున్న వాటితో కలిపి రాష్ట్రంలో బస్తీ దవాఖానల సంఖ్య 544కు పెరుగుతుందన్నారు. జనాభా, వైద్యసేవల అందుబాటు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకొని బస్తీదవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్తీ దవాఖానల్లో టీ-డయాగ్నొస్టిక్స్‌ సహకారంతో రోగ నిర్ధారణ కోసం ఎకడికకడే శాంపిల్స్‌ సేకరిస్తామని చెప్పారు. దీంతో ఉచిత వైద్యం, ఉచిత మందులు లభించడంతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలకు చేసే ఖర్చు కూడా పేదలకు తప్పుతుందని వివరించారు.

rain alert : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే 2 రోజుల్లో ఎక్కడ కురుస్తాయంటే..



నీతి ఆయోగ్‌ సోమవారం విడుదల చేసిన ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానం సాధించడం పట్ల మున్పిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.

covid-19: భారత్ సంచలనం.. ఒకేరోజు 2 వ్యాక్సిన్లు, 1 ట్యాబ్లెట్‌‌కు ఆమోదం.. అవేంటి? ఎలా వాడాలంటే..



ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో పరిధిలో మొత్తం బస్తీ దవాఖానలు 256 కాగా, మరో ఆరు నెలల్లో అంటే, జూన్ 2 నాటికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 141 మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలు ఏర్పాటవుతాయి. దాంతో మొత్తం ఆస్పత్రుల సంఖ్య 544కు పెరగనుంది. కొత్త బస్తీ దవాఖానలను వీలైతే కొత్త భవంతిలో లేదా అద్దె భవనాల్లో ఏర్పాటు చేయనున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Gandhi hospital, Harish Rao, Minister ktr, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు