హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Budget 2022: కేసీఆర్ వరాల కుమ్మరింపు.. 250 గజాల లోపు ఇళ్లకు పన్నులు రద్దు.. ఇంకా..

Telangana Budget 2022: కేసీఆర్ వరాల కుమ్మరింపు.. 250 గజాల లోపు ఇళ్లకు పన్నులు రద్దు.. ఇంకా..

అసెంబ్లీలో కేసీఆర్(పాత ఫొటో)

అసెంబ్లీలో కేసీఆర్(పాత ఫొటో)

కేసీఆర్ సర్కారు ఈనెల 7న ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ లో వరాల కుమ్మరింత ఉంటుందని సమాచారం. సొంత స్థలంలో ఇల్లుకు రూ.5 లక్షలు, 250 గజాల లోపు ఇళ్లకు ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు, 60 వేల ఉద్యోగాలపై నిర్ణయాలు వెలువడనున్నాయి..

ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ లో వరాల కుమ్మరింత ఉండబోతోందని విస్పష్టంగా తెలుస్తోంది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు, విశ్వనగరం జీహెచ్ఎంసీ పరిధిలో 250 గజాల లోపు ఇళ్లకు ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు తోపాటు బడ్జెట్ సమావేశాల్లోనే 60 వేల ఖాళీలను భర్తీ చేసే ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. వ్యవసాయం, సంక్షేమానికి మరో సరికొత్త కొత్త పథకాన్ని కూడా సీఎం కేసీఆర్ సిద్దం చేశారట. అంతేకాదు, ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది..

సామాన్య ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పనుంది.గ్రేటర్ పరిధిలో ఉన్న 200 నుంచి 250 చదరపు గజాలు లోపు ఉన్న.. నాన్ కమర్షియల్ ఇండ్లకు ప్రాపర్టీ టాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వనుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో జిహెచ్ఎంసి యాక్టర్ లో చట్ట సవరణ చేసి.. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయం అమలు అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ స్కీం అమలుకాని ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టాక్స్ చెల్లించడం వాళ్లకు దాన్ని..2033-23 ఆర్థిక సంవత్సరానికి వర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

CM KCRపై బీహారీ బాంబు మరింత బలంగా.. Revanth Reddy సంచలన వ్యాఖ్యలు.. అసాధారణ రచ్చ


ట్యాక్స్ రద్దుకు సంబంధించి నాలుగు నెలల క్రితమే జిహెచ్ఎంసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ లో 200 నుంచి 250 చదరపు గజాల లోపు ఉన్న ఆస్తులు 30 శాతం మాత్రమే ఉన్నాయి. ఇందులో సగం మంది ప్రాపర్టీ దారులు ఏడాదికి 101 రూపాయలు మాత్రమే పేద మధ్యతరగతి ఇండ్ల యజమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసి నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, 30 శాతం పోగా మిగిలిన కమర్షియల్, నాన్ కమర్షియల్ ప్రాపర్టీ దార్ల టాక్స్ ను పెంచేందుకు జిహెచ్ఎంసి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

CM KCR వ్యూహం బెడిసికొట్టిందా? -కేజ్రీవాల్‌తో భేటీ లేనట్టే? -ఢిల్లీ పర్యటన దానికోసం కాదట!


తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. అనూహ్యరీతిలో గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్ భేటీ సాగనుంది. రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6న కేబినెట్ భేటీ కానుంది. మార్చి 7వ తేదీన సభ తొలిరోజే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.

Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, GHMC, Telangana, Telangana Budget 2022

ఉత్తమ కథలు