హోమ్ /వార్తలు /తెలంగాణ /

etela rajenderకు మళ్లీ షాకిచ్చిన kcr సర్కార్ -ఈటల జమునకు నోటీసుల వెనుక అర్థం ఇదేనా?

etela rajenderకు మళ్లీ షాకిచ్చిన kcr సర్కార్ -ఈటల జమునకు నోటీసుల వెనుక అర్థం ఇదేనా?

నోటీసులు అందుకుంటోన్న ఈటల కోడలు

నోటీసులు అందుకుంటోన్న ఈటల కోడలు

బీజేపీకి తాను జారీ చేసిన హెచ్చరికలు మాటలకే పరిమితం కాదనే సంకేతమిస్తూ.. బీజేపీ తాజా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫ్యామిలీకి మరో షాకిచ్చారు సీఎం కేసీఆర్. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల సతీమణి జమున, తనయుడు నితిన్ రెడ్డిలకు తుఫ్రాన్ ఆర్డీఓ నోటీసులు జారీ చేశారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ కేసులో కదలిక మొదలైంది..

ఇంకా చదవండి ...

అడ్డం పొడుగు మాట్లాడే బీజేపీ నేతల మెడలు విరిచేస్తామంటూ తీవ్ర స్వరంతో హెచ్చరిక జారీ చేసిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆదివారం నాడు తొలిసారి ప్రెస్ మీట్ పెట్టిన సీఎం కేసీఆర్.. బీజేపీని తూర్పారపట్టారు. మళ్లీ సోమవారం కూడా మరో ప్రెస్ మీట్ పెట్టి కమలనాథుల్ని కడిగిపారేశారు. తన హెచ్చరికలు మాటలకే పరిమితం కాదనే సంకేతమిస్తూ.. బీజేపీ తాజా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫ్యామిలీకి మరో షాకిచ్చారు. భూకబ్జా వ్యవహారంలో ఈటల సతీమణి జమునకు, ఈటల కొడుకు నితిన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వ అధికారులు కీలక నోటీసులు జారీచేశారు. కొన్నాళ్లుగా దర్యాప్తు ఆగిన ఈ కేసు.. సరిగ్గా కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించగానే మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది..

దాదాపు 20 ఏళ్ల పాటు కేసీఆర్ కు ఆప్తుడిగా, టీఆర్ఎస్ లో నంబర్ 2గా కొనసాగిన ఈటల రాజేందర్.. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలోనే మంత్రి పదవి కోల్పోవడం, టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడం, కేసీఆర్ ను సవాలు చేసి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడం తెలిసిందే. ఈటల బీజేపీలో చేరినప్పటి నుంచీ భూకబ్జా కేసు మూలన పడటంతో కేసీఆర్ పంతం నెరవేరిందనే ప్రచారం జరిగింది. అయితే, హుజూరాబాద్ ఫలితం వచ్చిన వారం రోజులకే భూకబ్జా కేసుల్ని తిరగదోడుతోంది తెలంగాణ సర్కారు. ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ సంస్థకు సోమవారం ప్రభుత్వాధికారులు నోటీసులు జారీ చేశారు..

ఈటల కుటుంబీకులకు నోటీసులు ఇస్తోన్న అధికారులు

ఈట‌ల రాజేంద‌ర్ భూముల వ్య‌వ‌హారంలో మ‌రోసారి అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మెద‌క్ జిల్లా హ‌కీంపేట‌లో స‌ర్వే చేయ‌నున్న‌ట్టు నోటీసులు ఇచ్చారు. హ‌కీంపేట‌లోని స‌ర్వే నం-97లో స‌ర్వే చేయ‌నున్న‌ట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న స‌ర్వేకు హాజ‌రు కావాల‌ని తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. ఈట‌ల స‌తీమ‌ణి జ‌మున‌, కుమారుడు నితిన్ రెడ్డి పేరుతో జ‌మునా హ్యాచ‌రీస్ వ‌ద్ద అధికారులు నోటీసులు అంటించారు. నిజానికి హ్యాచరీస్ భూముల విషయంలో ఈటల కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించడం వల్లే ఇన్నాళ్లూ ప్రభుత్వం చర్యలకు దిగకుండా ఆగింది. అయితే..

petrol : వ్యాట్ వర్సెస్ సెస్ -ఇది కేసీఆర్, జగన్ ఉమ్మడి వ్యూహమా? -ఇక బీజేపీతో దబిడి దిబిడేనా?


ఈటల జమునకు నోటీసుల వ్యవహారంపై తుఫ్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. జమున హేచరీస్‌ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లినందున దానిపై హైకోర్టు కరోనా తదనంతరం నోటీసులు ఇచ్చి సర్వే చేయమని ఆదేశించిందని గుర్తు చేసిన ఆర్డీవో.. గతంలో కరోనా అధికంగా ఉండటం వల్ల తాము సర్వే చేయలేకపోయామని, ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేయడానికి సిద్ధమయ్యామని.. ఈ నెల 16 తేదీ నుండి 18వ తేదీ వరకు సర్వే చేయడానికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఈటల కుటుంబానికి మళ్లీ నోటీసులు ఇవ్వడం ద్వారా బీజేపీ పట్ల కేసీఆర్ నోకాంప్రమైజ్ ధోరణి ఎత్తుకున్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. పైగా


Huzurabad తర్వాత తొలిసారి CM KCR -సిల్లీ బీజేపీ మెడలు విరగ్గొడతా -వరి వద్దన్నది కేంద్రమే -బండిని ఘోరంగా


హుజూరాబాద్ లో బీజేపీ గెలుపుతో కేసీఆర్ పతనం మొదలైందనే కామెంట్లు రాగా, అలాంటి సాకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా, ఈటల గెలుపును తేలికచేసేలా సీఎం కేసీఆర్ అనూహ్య వ్యఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఓటమి వల్ల టీఆర్ఎస్ కుగానీ, తెలంగాణ ప్రభుత్వానికిగానీ పోయేదేమీ లేదని సీఎం అన్నారు. హుజూరాబాద్‌లో ఏదో ప్రళయం బద్దలైనట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉంటే, టీఆర్ఎస్‌కు 110 స్థానాలు ఉన్నాయని, ఉప ఎన్నికలు వస్తుంటాయని, వాటిలో కొన్ని గెలిస్తే, కొన్ని ఓడుతుంటామని.. అయితే ఆ ఎన్నికల్లో గెలుపుకూ, ప్రబుత్వ వ్యతిరేకతకూ సంబంధం లేదన్నారు. అలాగైతే, దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని, మరి ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లేనా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

First published:

Tags: Bjp, CM KCR, Etela rajender, Telangana News, Trs

ఉత్తమ కథలు