KCR GOVT ISSUED AMENDMENT ORDER REGARDING GRAM PANCHAYATS OVER DEPUTY SARPANCH CHECK POWER MKS
Check Power: గ్రామ పంచాయితీల్లో ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌పై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు
ప్రతీకాత్మక చిత్రం
పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ ల మధ్య వివాదాలు తారా స్థాయిలో కొనసాగుతున్నాయి. అదను చూసి ఉప సర్పంచ్ లు చెక్ లపై సంతకం చేయడం లేదు. ఈ గొడవలకు చెక్ పెడుతూ చెక్ పవన్ పై కేసీఆర్ సర్కారు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది..
గ్రామ పంచాయతీల్లోఉప సర్పంచ్ లకు ఉండే చెక్ పవర్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ ల మధ్య వివాదాలు తారా స్థాయిలో కొనసాగుతున్నాయి. అదను చూసి ఉప సర్పంచ్ లు చెక్ లపై సంతకం చేయడం లేదు. దీంతో గ్రామ పంచాయతి సిబ్బందితో పాటు ఇతర అవసరాలకు నిధులు అందడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉప సర్పంచ్ చెక్ పవర్ పై సవరించిన మార్గదర్శక ఉత్తర్వులను జారీ చేసింది.
ఏదైనా గ్రామ పంచాయితీలో ఉప సర్పంచ్ చెక్ పై సంతకాలు పెట్టడానికి ఇబ్బంది పెడితే.. ఆ గ్రామ పంచాయతిలోని ఎవరైనా ఒక్క వార్డు మెంబర్ ను ఎంచుకుని చెక్ పై సంతకం చేయడానికి అవకాశం కల్పించింది. దీనికి అవసరం అయిన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర పంచాయతి రాజ్ అధికారులు విడుదల చేశారు.
ఈ మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతిల్లో చెక్ పై ఉప సర్పంచ్ సంతకాలు చేయకుండా.. పదే పదే ఇబ్బంది పెడితే వారి స్థానంలో ఒక వార్డు సభ్యులను ఎంచుకుని.. చెక్ పై సంతకాలు పెట్టే అధికారం కల్పించాలని పంచాయతి రాజ్ అధికారులు తెలిపారు. దీని కోసం ఒక గ్రామ సభ నిర్వహించాలని సూచించారు.
ఈ గ్రామ సభలో వార్డు సభ్యులకు అధికారం ఇస్తున్నట్టు తీర్మాణం కూడా రాయాలని సూచించారు. ఈ తీర్మాణం పై జిల్లా కలెక్టర్ అనుమతి కూడా ఉండాలని తెలిపారు. కాగ ఈ మార్గదర్శకాలను అన్ని జిల్లాల కలెక్టర్లుకు జారీ చేసింది. అలాగే ఈ కొత్త మార్గదర్శకాలను రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతిలకు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.