కాళేశ్వరంలో లక్ష్మీ, సరస్వతి, పార్వతి...కేసీఆర్ కీలక నిర్ణయం...

మేడిగడ్డ బ్యారేజ్‌కి లక్ష్మి బారాజ్ గా, కన్నెపల్లి పంపుహౌజుకు లక్ష్మి పంపు హౌజుగా నామకరణం చేశారు. అన్నారం బ్యారేజికి సరస్వతి బారాజ్ గా, సిరిపురం పంప్ హౌజ్ కు సరస్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు.

news18-telugu
Updated: August 10, 2019, 8:37 PM IST
కాళేశ్వరంలో లక్ష్మీ, సరస్వతి, పార్వతి...కేసీఆర్ కీలక నిర్ణయం...
Photos: కాళేశ్వరం, మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టులను సందర్శించిన కేసీఆర్
  • Share this:
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజ్‌లు, పంపుహౌజులకు దేవతామూర్తుల పేర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌కి లక్ష్మి బారాజ్ గా, కన్నెపల్లి పంపుహౌజుకు లక్ష్మి పంపు హౌజుగా నామకరణం చేశారు. అన్నారం బ్యారేజికి సరస్వతి బారాజ్ గా, సిరిపురం పంప్ హౌజ్ కు సరస్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు. సుందిళ్ల బారాజ్ కు పార్వతి బారాజ్ గా, గోలివాడ పంపుహౌజు కు పార్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు. నంది మేడారం రిజర్వాయర్ కమ్ పంపు హౌజుకు నంది పేరు ఖరారు చేశారు. లక్ష్మిపురం పంపుహౌజుకు గాయత్రి పేరు పెట్టారు. ఇదిలాఉంటే గత ప్రభుత్వాలు రాజకీయ ప్రముఖులు, వ్యక్తుల పేర్లను పెట్టడం ఆనవాయితీ. అయితే కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు కీలక ప్రాజెక్టులకు స్థానిక దేవాలయాల్లో కొలువైన దేవుళ్ల పేర్లను పెట్టే సంప్రదాయానికి తెరలేపారు. ఇందులో భాగంగానే భక్త రామదాసు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు సైతం స్థానిక పుణ్యక్షేత్రం ఆధారంగానే నామకరణం చేయడం విశేషం.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు