CM KCR School: రాజ భవనాన్ని తలపించేలా పాఠశాల భవన నిర్మాణం.. అదెక్కడ ఉందో తెలుసా..

సీఎం కేసీఆర్ చదువుకున్న పాఠశాల కొత్త భవనం

CM Kcr School: బాల్యంలో సీఎం కేసీఆర్ చదువకున్న పాఠశాల శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో మరో పాఠశాలను నిర్మించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దానిని కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు. పాఠశాల నుంచి జూనియర్‌ కాలేజీ వరకు ఒకేచోట ఉండేలా నిర్మించారు. దీనిని త్వరలో కేసీఆర్ ప్రారంభించనున్నారు.

 • Share this:
  (కె. వీరన్న, మెదక్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  ఎంత ఉన్నత శిఖరాలకు చేరినా బాల్యంలో చదువుకున్న పాఠశాలను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఊళ్లో పుట్టినందు గ్రామానికి ఏదో ఒకటి చేయాలని చాలా మంది పెద్దలు అంటుంటారు. అందుకే చాలామంది తన పుట్టిన ఊరికి, చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహాయం చేస్తారు. చిన్నతనంలో చదువుకున్న పాఠశాలకు మనం వెళ్లినప్పడు ఎన్నో జ్ఞాపకాలు, మధురానుభూతులు, ఉపాధ్యాయులు బోధించిన తీరు ప్రతీ ఒక్కటీ గుర్తుకు వస్తాయి. అలాగే మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రాథమిక విద్య నుంచి 9వ తరగతి దాకా దుబ్బాకలోని పాఠశాలలో చదువుకున్నారు. అక్కడ అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేమని సీఎం కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే ఈ మధ్య ఆ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చి వేశారు. దాని స్థానంలో నూతన భవన నిర్మాణానికి రూ.6 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారు. తర్వాత నిధులను పెంచారు.

  ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల ఒకేచోట ఉండాలనే సంకల్పంతో 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులతో నిర్మించారు. పాఠశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ప్రయోగశాలలు, ఒక ఆర్ట్స్‌ గది, కామన్‌ గది, ఒక స్టోర్‌ రూం, ప్రధానోపాధ్యాయుడి గది, మూడు సిబ్బంది గదులు ఉన్నాయి. రూ.10.5 కోట్లతో కార్పొరేట్‌ స్థాయిలో సకల సౌకర్యాలతో నిర్మించారు. రోమ్‌ శిల్పకళా నమూనాలో రాజ్‌మహల్‌ను తలపించేలా ఈ భనవం ఉంది. 250 మంది ఒకేసారి వినియోగించుకునేలా బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. పాఠశాల, కళాశాలలకు విడివిడిగా నీటి ట్యాంకులున్నాయి.

  ప్రత్యేక విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలను చూసిన ప్రతీ ఒక్కరూ ఇంద్రభవనాళ్ల కనిపిస్తున్నాయంటూ చెబుతున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ చదువుకున్న ఒక్క పాఠశాలకు మాత్రమే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్ష నాయకులు విపర్శిస్తున్నారు. ఈ ఒక్క పాఠశాలకు పెట్టే ఖర్చు పల్లెల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టొచ్చని అంటున్నారు.
  Published by:Veera Babu
  First published: