KCR B DAY : నేడు కేసీఆర్ పుట్టిన రోజు... ఇవీ ప్రత్యేకతలు...

KCR BIRTH DAY : ప్రజాకర్షక పథకాలతో జననేతగా ఎదిగిన కేసీఆర్ 66వ పుట్టిన రోజును తమ వేడుకలా జరుపుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. అంతలా ఆయన్ని ఎందుకు అభిమానిస్తున్నారంటే కారణం ప్రభుత్వ పథకాలే.

news18-telugu
Updated: February 17, 2020, 5:55 AM IST
KCR B DAY : నేడు కేసీఆర్ పుట్టిన రోజు... ఇవీ ప్రత్యేకతలు...
KCR B DAY : నేడు కేసీఆర్ పుట్టిన రోజు... ఇవీ ప్రత్యేకతలు... (File)
  • Share this:
Telangana CM Kcr Birth Day : తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 66వ పుట్టిన రోజును పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యంత వైభవంగా జరుపుతున్నారు. 1954 ఫిబ్రవరి 17న సిద్ధిపేటలో జన్మించిన కేసీఆర్... ఏటికేడు అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా కంటే... స్వయంగానే ప్రజలతో టచ్‌లో ఉంటూ ఫాలోయర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. ఇలా ఆయనపై అభిమానం చూపించడానికి అనేక కారణాలున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కేసీఆర్‌ను ప్రజలకు చేరువ చేశాయి. రెండోసారి భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశాయి. అందువల్లే కేసీఆర్ పుట్టిన రోజును ఓ వేడుకలా జరుపుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం తెలంగాణలో లోటు బడ్జెట్ ఉన్నా, నిధులు లేకపోయినా... ప్రభుత్వ పథకాల్నీ, ప్రాజెక్టుల్నీ కొనసాగిస్తున్నారు కేసీఆర్.





రైతు బంధువు, చేనేత లక్ష్మి, కళ్యాణ లక్ష్మీ - షాదీ ముబారక్, ఆసరా పింఛన్ స్కీం, అమ్మఒడి కేసీఆర్ కిట్, పల్లె ప్రగతి, హరితహారం, మిషన్ కాకతీయ, షీ టీమ్స్, కంటి వెలుగు, టీఎస్ ఐపాస్ ఇలా ఎన్నో పథకాలు. కొన్నైతే మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేస్తున్నారు. అందువల్లే కేసీఆర్‌ పాలనపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ తరహా పాలనే ప్రజలకు ఆయన్ని దగ్గర చేస్తోంది.


కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా... టీఆర్ఎస్ నేతలు, అభిమానులు, కార్యకర్తలు రకరకాలుగా వేడుకలు జరుపుతున్నారు. హైదరాబాద్‌ జలవిహార్‌లో కేసీఆర్ లోగోను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామమని తెలిపారు. గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీటిలో పాల్గొంటారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు.



కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలోని గజ్వేల్‌లో వేల మొక్కలు నాటి కేసీఆర్‌కి శుభాకాంక్షలు చెప్పబోతున్నారు. ఈ సందర్భంగా 2600 మంది కేసీఆర్ ముఖాకృతిలో నిల్చోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సోషల్ మీడియాలో కూడా కేసీఆర్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.



First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు