కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలోని అన్ని రకాల ఎన్నికలను వాయిదా వేస్తున్న ఎన్నికల సంఘం... తాజాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను కూడా వాయిదా వేసింది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత బరిలో నిలిచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భాగంగా మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
వీరిలో ఇద్దరు అభ్యర్థులు శ్రీనివాస్, భాస్కర్ నామినేషన్లను పరిశీలన సమయంలోనే అధికారులు తిరస్కరించారు. లోయపల్లి నర్సింగ్‌రావు శనివారం, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. ఏప్రిల్ 7న ఆరు కేంద్రాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా... ఈసీ ఈ ఎన్నికను వాయిదా వేసింది. ఈ ఉపఎన్నికలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 824 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.