Bus in Fire : హైదరాబాద్‌లో కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. JNTU మెట్రో స్టేషన్ కిందకు రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. ముందుగా పొగలు రాసాగాయి. అది చూసి అలర్టైన డ్రైవర్.. లోపలున్న 17 మంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దాంతో ప్రయాణికులంతా గబగబా తమ లగేజీ తీసుకొని.. బస్సు దిగిపోయారు. అప్పటికే చాలా పెద్దగా వ్యాపించిన మంటలు.. బస్సు అంతా పాకాయి. బస్సు మొత్తం కాలి బూడిదైంది.
ఈ బస్సు హైదరాబాద్ నుంచి గోవా వెళ్తోంది. అక్కడ వీకెండ్‌ని ఎంజాయ్ చేద్దామనుకున్న ప్రయాణికులకు ఈ బస్సు చుక్కలు చూపించింది. ఇది ఏసీ స్లీపర్ బస్సు కావడం వల్ల.. ఏసీలో ఏదో తేడా వచ్చి మంటలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఐతే.. బస్సుకి మంటలు వ్యాపించిన సమయంలో ప్రయాణికులు మెలకువగానే ఉన్నారు. ఇంకా నిద్రపోలేదు. అందువల్లే వారు త్వరగా దిగిపోగలిగారు.
అందరూ దిగిపోయిన తర్వాత.. విపరీతంగా మంటలు చెలరేగి.. బస్సు కాలిపోయింది. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పినా.. అప్పటికే బస్సు మొత్తం కాలిపోయింది. నిజంగా ఇది అదృష్టం అనుకోవాలి. ఇలా జరగకుండా RTO అధికారులు తరచూ వాహనాల ఫిట్‌నెస్‌ను పరీక్షించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ఘటనతో మెట్రో రూట్‌లో వాహనాల ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది. ఆ తర్వాత పోలీసులు అంతా సెట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, JNTUH, Mana telangana, Telangana