నేడు ఢిల్లీలోని జాతీయ మహిళా కమీషన్ (National Women Commission) ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy) హాజరయ్యారు. కొన్నిరోజుల క్రితం గవర్నర్ తమిళిసైపై (Governor Tamilisai) చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గానూ విచారణకు రావాలని ఇటీవల నేషనల్ ఉమెన్స్ కమీషన్ నోటీసులు ఇచ్చింది. దీనితో ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఆయన జాతీయ మహిళా కమీషన్ (National Women Commission) కు వివరణ ఇచ్చారు.
కొన్నిరోజుల క్రితం హుజురాబాద్ లోని జమ్మికుంటలో నిర్వహించిన ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy) రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ, పెండింగ్ బిల్లుల అంశంపై గవర్నర్ వ్యహరిస్తున్న తీరుపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy) నిలదీశారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటి దాకా గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy) అనుచిత పదజాలాన్ని వాడారు. ఈ వ్యాఖ్యలు గతంలో పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేయడంతో కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy)కి నోటీసులు ఇవ్వడం..ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం కూడా జరిగింది.
కాగా కొన్నిరోజులుగా పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy) బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల హుజురాబాద్ టికెట్ పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy)కే దక్కుతుందని కేటీఆర్ ఇచ్చిన సంకేతాలతో తేలిపోయింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Governor Tamilisai, Huzurabad, Telangana