Katta Venkata Narasaiah: తెలంగాణ... మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. యుక్త వయసు నుంచి వెంకటనర్సయ్య రాజకీయాల్లో ఉన్నారు. మధిర శాసనసభ స్థానానికి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2009 శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీ అవలంభించిన విధానాలు, రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి... మరో నెలలో గడువు ముగుస్తుందనగా రాజీనామా చేశారు. చనిపోయేంత వరకు పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి పనిచేశారు.
ఇది కూడా చదవండి: Milk Health Tips: ఈ ఐదింటినీ పాలతో కలిపి తీసుకోకండి... ఆరోగ్యానికి ప్రమాదం
కట్టా వెంకటనర్సయ్య మృతి పట్ల సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అరుదైన నేత అనీ... ఎప్పుడూ, ఎక్కడా రాజీ పడకుండా విలువలే ఆస్తిగా బతికారని ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మరణం తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana News, Telugu news