తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. కరోనా కాలంలో ఎంతో మంది... సాయం కోసం ఆయనకు ట్వీట్ చేస్తున్నారు. మందుల కోసం కొందరు.. ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూళ్లపై మరికొందరు.. మంత్రి కేటీఆర్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆ ట్వీట్లకు ఆయన వెంటనే స్పందిస్తూ.. సమస్యను పరిష్కరిస్తున్నారు. తాజాగా కర్నాటక మాజీ మంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డి.కే. శివకుమార్ కూడా మంత్రి కేటీఆర్ సాయం కోరారు. హైదరాబాద్‌లో ఇబ్బందులు పడుతున్న కర్నాటక మహిళను ఆదుకోవాలని ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు.
కర్నాటకలోని మాండ్యా ప్రాంతానికి చెందిన శశికళ మంజునాథ్ భర్త కరోనాతో హైదరాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోవిడ్ చికిత్సకు రూ.7.5 లక్షల బిల్లు వేశారు. ఐతే తాను రూ.2 లక్షలే కట్టగలనని, అంతకు మించి కట్టేందుకు తమకు స్థోమత లేదని చెప్పింది. కానీ ఆస్పత్రి యాజమాన్యం వినలేదు. మొత్తం డబ్బులు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆమె బంధువులు కర్నాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డి.శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని ఆదుకోవాల్సిందిగా ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు శివ కుమార్.
ఆయన విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. వారి వివరాలను అందజేయాలని కోరారు. మెడికవర్ ఆస్పత్రితో తక్షణం మాట్లాడాలని తన సిబ్బందిని ఆదేశించారు కేటీఆర్.
Shivakumar Garu, Will take care immediately if you can pass on her contact information
— KTR (@KTRTRS) May 30, 2021
@KTRoffice get in touch with hospital immediately https://t.co/33ApR5AhCK
తెలంగాణలో చాలా చోట్ల ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగులను నిలువునా దోచేస్తున్నాయి. లక్షలకు లక్షలు బిల్లులు వేస్తున్నాయి. ఒకవేళ కరోనా రోగి మరణిస్తే..మొత్తం డబ్బులు కట్టే వరకు మృతదేహాన్ని బంధువులకు ఇవ్వడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలపై ఎంతో మంది ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదుచేస్తున్నారు. వాటిపై ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా పలు ప్రైవేట్ ఆస్పత్రులపై ఇప్పటికే చర్యలు తీసుకుంది. అధిక వసూలు వసూలు చేస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dk shivakumar, Hyderabad, KTR, Telangana