హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bus Fire: బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు.. అందరిదీ హైదరాబాదే..

Bus Fire: బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు.. అందరిదీ హైదరాబాదే..

మంటల్లో కాలిపోతున్నబస్సు

మంటల్లో కాలిపోతున్నబస్సు

Bus Accident: బస్సు ప్రమాదంపై ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించింది. బస్సు పూర్తి ఫిట్‌నెస్‌గా ఉందని చెప్పారు. ఓ టెంపో వాహనం అదుపుతప్పి ఎదురుగా వచ్చిందని.. దానిని తప్పించే క్రమంలోనే బస్సు బలంగా ఢీకొట్టిందని తెలిపారు.

  కర్నాటక బస్సు ప్రమాదం (Karnataka Bus Accident)లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది మరణించారు. నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోగా.. మరో నలుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతులంతా హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన వారే.  గోవా టూర్‌ (Goa Tour)కి వెళ్లి తిరిగి వస్తుండగా... కర్నాటకలోని కలబురిగి (Kalaburagi Accident) జిల్లా కమలాపుర వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారిని.. అర్జున్ (35), సరళ (32), బి.అర్జున్ (5), శివకుమార్ (35), రవళి (30), దీక్షిత్ (9), అనిత (40)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మరో 12 మందిని స్థానికులు కాపాడారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  J&K : కశ్మీర్ లో ఎనిమిది మంది పౌరులని కాల్చి చంపిన ఉగ్రవాదులు..రా,ఎన్ఎస్ఏ చీఫ్ లతో షా భేటీ

  హైదరాబాద్‌ ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన అర్జున్ కుమార్ తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం మే 29న దాదాపు 26 మందిని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో గోవాకు తీసుకెళ్లారు. అందులో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉన్నారు. టూర్ ముగిసిన తర్వాత గురువారం సాయంత్రం గోవాలోని పంజిమ్‌ నుంచి బయలుదేరారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో.. బస్సు కర్నాటకలోని కలబురిగి జిల్లా కమలాపుర వద్దకు చేరుకోగానే.. అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న టెంపో వాహనాన్ని ఢీకొట్టి.. రోడ్డు కిందకు దూసుకెళ్లింది. డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొందరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడ్డారు. కానీ మరికొందరు మాత్రం తప్పించుకోలేకపోయారు. మంటల్లో కాలిపోయి మరణించారు.

  హైదరాబాద్‌కు వస్తుండగా ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

  బస్సు ప్రమాదంపై ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించింది. ఈ ఘటన దురదృష్టకరమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బస్సు పూర్తి ఫిట్‌నెస్‌గా ఉందని చెప్పారు. ఓ టెంపో వాహనం అదుపుతప్పి ఎదురుగా వచ్చిందని.. దానిని తప్పించే క్రమంలోనే బస్సు బలంగా ఢీకొట్టిందని తెలిపారు. ఆ తర్వాత కల్వర్టును ఢీకొట్టి.. రోడ్డు కిందకు దూసుకెళ్లి.. మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. రెండు ఎగ్జిట్ డోర్లు ఓపెన్ కావడం వల్లే చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. ఒక డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో డ్రైవర్, క్లీనర్ ప్రస్తుతం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Karnataka, Road accident

  ఉత్తమ కథలు