(P.Srinivas,New18,Karimnagar)
తెలంగాణ(Telangana)లో వలస కష్టాలు తీరడం లేదు. మెరుగైన ఉపాధి కోసం చాలా మంది పొరుగు రాష్ట్రాలకు, గల్ఫ్(Gulf)దేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు దళారుల చేతుల్లో దగా పడుతున్నారు. తీరా దుబాయ్(Dubai), కువైట్(Kuwait),వంటి ప్రాంతాలకు వెళ్లిన తర్వాత అక్కడి కంపెనీలు, కాంట్రాక్టు సంస్ధలు తక్కువ డబ్బులు ఇస్తూ వెట్టి చాకిరి చేయించుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి రోడ్డున పడ్డారు. తమ గోడును వెళ్లబుచ్చుతూ వీడియో(Video)ని షేర్ చేశారు.
ఎయిర్‌పోర్ట్‌లో కష్టాలు ..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు యువకులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక్క యువకుడు, దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దుబాయ్ లోని ఓ కంపెనీ సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ జిల్లా ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి పనికి పిలిపించుకున్నాయి. తీరా దుబాయ్‌కి వెళ్లిన తర్వాత ఇండియాలో చెప్పిన పనితో పాటు జీతం అక్కడ ఇవ్వలేదంటూ కంపెనీతో ఐదుగురు యువకులు వాగ్వాదానికి దిగారు. కంపెనీ పోలీసులను పిలిపించి తాగి న్యూసెన్స్ చేస్తున్నారని కేసులు బుక్ చేయించారు. అయినా యువకులు వినక పోవడంతో మీరు ఇండియా నుంచి టికెట్ తెప్పించుకోండి మిమ్మల్ని ఇండియాకు పంపిస్తామని చెప్పారు.
ఐదుగురి ఆవేదన..
ఐదుగురు యువకులు ఇంటి దగ్గర నుంచి టికెట్లు తెప్పించుకున్నారు. అయినా కంపెనీ బాధితుల పాస్‌పోర్ట్‌లు ఇచ్చి ఎయిర్‌పోర్ట్‌లో వదిలేశారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఐదుగురు యువకులు శనివారం రాత్రి దుబాయ్ నుండి ఇండియాకి రావలసి ఉంది. యువకుల పాస్‌పోర్ట్‌లు, ఫ్లైట్ టికెట్స్ తీసుకొని ఎయిర్ పోర్ట్‌లోనికి వెళ్లారు. ఐదుగురికి ఎయిర్ పోర్ట్‌లో బోర్డింగ్ పాస్ పూర్తయింది. కానీ ఎయిర్‌పోర్టులో అక్కడి పోలీసులు వాళ్ల పాస్‌పోర్ట్‌లు చెక్ చేయడంతో మీపైన కేసులు ఉన్నాయి కాబట్టి ఇండియాకు వెళ్లకూడదని అభ్యంతరం చెప్పి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు పంపించారు.
దుబాయ్ వలస కష్టాలు ..
ఇండియాకు వెళ్దామని వచ్చిన ఐదుగురు యువకులు జాబ్స్ కోసం ఇంటర్వూలు చేసిన ఏజెంట్లతో పాటు ఉద్యోగంలో పెట్టుకున్న కంపెనీకి ఫోన్ చేయడంతో ఎవరూ స్పందించలేదు. దీంతో బాధిత యువకులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులకు బాధల్ని చెప్పుకున్నారు. కనీసం ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో తాగడానికి నీళ్లు, తిండి కూడా లేదని వీడియో పంపడంతో ఇండియాలోని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డలను ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నారు.
బంధీలకు విముక్తి కలిగించండి ..
ఇప్పుడే కాదు గతంలో కూడా ఇదే విధంగా కరీంనగర్ , సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన చాలా మంది దుబాయిలో పని కోసం వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. తెలంగాణ ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఇక్కడ యువకులు మాత్రం విదేశాలపై మక్కువ చూపడంతో.. వీరిని ఆసరాగా చేసుకొని ఏజెంట్లు దుబాయ్ ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకొని తర్వాత చేతులు ఎత్తేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైన ఈతరహాలో మోసం చేస్తున్న ఏజెంట్ల మాయలో పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dubai, Karimnagar, Telangana News