• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • KARIMNAGAR YOUNG MAN ONE SIDE LOVE ATTACK ON HIS LOVER WITH KNIFE IN JAGITYAL VRY

Jagityal : ప్రేమించడం లేదని కత్తితో దాడి..అనంతరం తాను కూడ

Jagityal : ప్రేమించడం లేదని కత్తితో దాడి..అనంతరం తాను కూడ

ప్రేమించడం లేదని కత్తితో దాడి.

Jagityala : ప్రేమించడం లేదని ఓ యువతిని కత్తితో పోడిచాడు. అనంతరం తాను కూడ మెడపై కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే స్థానికులు గమనించడంతో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

  • Share this:
రోజులు మారుతున్నా యువకుల్లో మార్పులు రావడం లేదు. వన్‌సైడ్ ప్రేమతో యువతులను బలి
చేస్తూ...తమను తాము శిక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమని ప్రేమించకపోతే ఎదుటి వ్యక్తులను
దారుణంగా చంపివేయడం మాములుగా మారిపోయింది. ప్రేమిస్తున్నామంటూనే యువతులను కడతేర్చడం ఓకింత ప్రమాదంగా మారుతోంది.

ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లాలో మరో దారుణం జరిగింది. జిల్లాలో జాబితాపూర్ గ్రామంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని, యువతిని కత్తితో పొడిచాడు. అనంతరం తాను కూడ అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. సంఘటన జరిగిన తర్వాత స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని హుటాహుటిన జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా యువకుడు మేడిపల్లి మండలం మన్నెగూడెంకు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు