హోమ్ /వార్తలు /తెలంగాణ /

Suicide: ఆ టార్చర్ భరించలేక ఎంసెట్ ర్యాంకర్‌ సూసైడ్ .. ప్రాణాలు తీసిన 15వేల అప్పు

Suicide: ఆ టార్చర్ భరించలేక ఎంసెట్ ర్యాంకర్‌ సూసైడ్ .. ప్రాణాలు తీసిన 15వేల అప్పు

Loan app death

Loan app death

Suicide: భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు కష్టపడి చదివి ఎంసెట్‌లో ర్యాంకు సాధించాడు. అయితే కెరియర్‌ ప్లాన్ చేసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆ యువకుడు వాళ్ల వలలో పడి నూరేళ్ల జీవితాన్ని ఆర్ధాంతరంగా ముగించడం అందర్ని బాధించింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు అతను కష్టపడి చదివి ఎంసెట్‌(Emcet)లో రెండు వేల ర్యాంకు సాధించాడు. అయితే రుణ యాప్‌ (Loan app)వలలో చిక్కి చివరికి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.ఈ విషాద ఘటన హైదరాబాద్‌(Hyderabad)లో జరిగింది. ఇందులో కరీంనగర్‌(Karimnagar)కి చెందిన ముని సాయి(Muni Sai)అనే యువకుడు తన జీవితాన్ని అర్థంతరంగా ముగించాడు. పొలం పనులు చేసుకుంటూ బిడ్డను చదివించిన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. చెట్టంత ఎదిగిన కొడుకు లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు బిడ్డ బలైపోతాయని ఊహించలేకపోయామంటున్నారు.

  Danger Spot : అది యమపురికి రహదారి .. అటుగా వెళ్లాలంటే భయపడిపోతున్న వాహనదారులు

  అప్పు తీసిన ప్రాణం ..

  కరీంనగర్ సమీపంలోని నగునూరుకు చెందిన శ్రీధర్, పద్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. వీరికి ఓ కుమార్తెతో పాటు కుమారుడు ముని సాయి ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎంసెట్ పరీక్షల్లో ముని సాయికి 2000 ర్యాంకు వచ్చింది. దీంతో ఎంతో సంతోషంలో మునిగిపోయిన ఆ కుటుంబం ముని సాయి ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేశారు. ముందుగా కౌన్సిలింగ్‌కి హాజరు కావడానికి హైదరాబాద్ కి వచ్చి శంషాబాద్ లోని తన స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. పట్టణంలోని వివిధ కాలేజీలకు సంబంధించి వివరాలు సేకరిస్తూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడు. కౌన్సిలింగ్ కాగానే పూర్తిగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచన చేశాడు.

  20ఏళ్లకే నూరేళ్లు నిండాయి..

  కెరియర్‌పై ప్లాన్ చేసుకుంటున్న సమయంలోనే నాలుగు నెలల క్రితం లోన్ యాప్‌ నుంచి వచ్చిన మెసేజ్‌కి స్పందించడమే ముని సాయి చేసిన పొరపాటు అయింది. ఆన్‌లైన్ యాప్‌లో లోన్ కోసం అప్లై చేశాడు ముని సాయి. కేవలం పదివేల రూపాయల లోన్ ఎం-పాకెట్, ధని యాప్ ల ద్వారా తీసుకున్నాడు. అయితే సదరు యాప్ నిర్వాహకులు కాల్ సెంటర్ నుండి వరుసగా ఫోన్ చేస్తూ బెదిరించడంతో ఇప్పటికీ దాదాపు 45 వేల రూపాయల వరకు కట్టాడు. అంతటితో ఆగని యాప్స్ సిబ్బంది మరో 15000 కట్టాలంటూ పరుషమైన పదజాలంతో ముని సాయిని బెదిరించారు.

  టార్చర్ భరించలేకే ..

  అంతేకాకుండా తనకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని ఇచ్చిన కాంటాక్ట్లకు సైతం తను చీటర్ అంటూ ఫోటోలు పెడతామని బెదిరించసాగారు. నిజంగానే పరిస్థితి అంతవరకు వెళుతుందని భయపడ్డ ముని సాయి ఈనెల 20వ తారీఖున పురుగుల మందు తాగి ఆత్మహత్యకి ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం రోజు మృతి చెందాడు. ఒకవైపు దాదాపుగా 50,000 కట్టిన మరోవైపు ముని సాయి ట్రీట్మెంట్ కోసం మూడు లక్షలు ఖర్చు చేసిన చివరకు అందమైన భవిష్యత్తు ఉన్న ఈ యువకుడి జీవితం అర్దంతరంగా ముగిసినట్లయింది.

  TS RTC : ఆ జిల్లాలో కార్గో సర్వీసులతో ఆర్టీసీకి 6.87 కోట్ల ఆదాయం .. ఎన్ని రోజుల్లో అంటే

  అవగాహన లేకపోతే అంతే..

  చిన్నప్పటినుండి కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించినప్పటికీ యాప్ వలలో చిక్కి ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా అనేకమంది ఈ యాప్ లలో చిక్కి ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వాలు కానీ ...పోలీసులు కానీ తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఇలాంటి విషాదకర సంఘటనలు ఆపడం లేదు. కనీసం ప్రజలే ఇలాంటి లోన్ యాప్ నిర్వాహకుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాటి జోలికి పోకపోతేనే మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Loan apps, Telangana News

  ఉత్తమ కథలు