Home /News /telangana /

KARIMNAGAR YOUNG MAN COMMITS SUICIDE AFTER BEING HARASSED BY MONEYLENDER IN KARIMNAGAR DISTRICT SNR KNR

Karimnagar:వడ్డీవ్యాపారి ఒత్తిడితో యువకుడు సూసైడ్..చావుకు అధిక వడ్డీనే కారణమంటూ లేఖ

(అధిక వడ్డీలు కట్టలేక)

(అధిక వడ్డీలు కట్టలేక)

Karimnagar:అప్పు అతని ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. అధిక వడ్డీల వేధింపులు ఆత్మీయులను దూరం చేస్తుందని గ్రహించలేకపోయాడు. అవసరాల కోసం అప్పు చేస్తే ..చివరకు అది అతని జీవితానికి ఉరితాడుగా మారి పాతికేళ్ల వయసులోనే నూరేళ్ల జీవితాన్ని ముగించేలా చేసింది.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    తెలంగాణ(Telangana)లో వడ్డీ వ్యాపారుల(Interest Traders) ఆగడలు రోజురోజుకు శృతి మించిపోతున్నాయి. చేస్తున్నది అక్రమ వ్యాపారం అయినప్పటికి అధిక వడ్డీలు వసూలు చేస్తూ బాధితులను వేధింపులకు గురి చేస్తున్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు ముప్పేట దాడులు చేసి వడ్డీ వ్యాపారుల భరతం పట్టినప్పటికి తీరు మార్చుకోవడం లేదు. కరీంనగర్(Karimnagar)జిల్లా మానకొండూరు (Manakondoru) మండలం అన్నారం (Annaram)గ్రామానికి చెందిన ప్రశాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. మృతుడు ప్రశాంత్‌
    (Prashanth)రాసిన సూసైడ్ లెటర్‌(Suicide Letter)‌లో వడ్డీ వ్యాపారి వసూలు చేసిన తీరు , అతనికి వడ్డీ కోసం చేసిన అప్పుల వివరాలను రాసి చనిపోయాడు.

    అప్పిచ్చిన వాడే యుముడయ్యాడు..
    మానకొండూరు మండలం అన్నారంగ్రామానికి చెందిన మార్క ప్రశాంత్ శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు . ఇదే గ్రామానికి చెందిన ముద్రకోల రామాంజనేయులు దగ్గర కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. ఆ నగదుపై 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేయడంతో మొత్తం 20 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చిందని మృతుడు ప్రశాంత్ సూసైడ్‌ లెటర్‌లో పేర్కొన్నాడు. ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తికి ఇప్పటికి వరకు పది లక్షల రూపాయలు చెల్లించినట్లు సూసైడ్ నోట్లో వివరించిన ప్రశాంత్ ఇంకా 20 లక్షలు అప్పు ఇవ్వాలని ఈవిషయాన్ని ఎవరికీ చెప్పకూడదని రామంజనేయులు అంటున్నట్లుగా లెటర్‌లో రాశాడు.

    కరీంనగర్ జిల్లాలో వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక యువకుడు సూసైడ్ | Young man commits suicide after being harassed by moneylender in Karimnagar district
    (అధిక వడ్డీలు కట్టలేక..)


    అధిక వడ్డీలు కట్టలేక..
    మృతుడు ప్రశాంత్‌కి వివాహమైంది. భార్య ఐదు నెలల గర్భిణి. వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న తల్లిదండ్రులను, భార్యను ఒంటరివాళ్లను చేసి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా అందర్ని కలచివేసింది. అంతే కాదు సూసైడ్‌ నోట్‌లో ప్రశాంత్‌ అప్పు చేసి తప్పు చేశానంటే పెళ్లి చేసుకుని ఇంకా పెద్ద తప్పు చేశానంటూ భార్య అనన్యకు క్షమాపణలు కోరుతూ సారీ అని రాశాడు. కేవలం అధిక వడ్డీ వేధింపుల కారణంగానే నూరేళ్లు బ్రతకాల్సిన ఓ యువకుడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడంపై కుటుంబ సభ్యులు, భార్య, తల్లిదండ్రులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. సూసైడ్‌ లెటర్‌ చదువుతూ కన్నీటిపర్యంతమవుతున్నారు.

    అందర్ని వదిలేసుకున్నాడు..
    చివరగా సూసైడ్‌ లెటర్‌లో సోదరుడికి సారీ చెప్పి అమ్మా,నాన్న, అమ్మమ్మను బాగా చూసుకోమని రాశాడు ప్రశాంత్. మళ్లీ జన్మంటు ఉంటే నీకు తమ్ముడిగా పుడతానంటూ శోకతప్తహృదయంతో లెటర్ రాసి చనిపోయాడు ప్రశాంత్. చివరగా తనకు అప్పు ఇచ్చిన రామాంజనేయులుకు మాత్రం ఒక్క పైసా కట్టవద్దని కోరాడు. బంధువులైన విక్రం బావకు రూ . 3 లక్షలు , శ్రీకాంత్ అల్లుడికి రూ . 3 లక్షలు , దేవన్నకు రూ . 1.50 లక్షలు , చింటూకు రూ .1.50 లక్షలు , ముద్రికోల్ల మధుకు రూ . లక్ష తిరిగి చెల్లించమని తమ్ముడుకి కుటుంబ బాధ్యతతో పాటు అప్పుల లెక్కలను వివరంగా లేఖలో పేర్కొన్నాడు. సోదరిని ఓదార్చమని బావను కూడా మృతుడు కోరాడు. ప్రశాంత్‌ సూసైడ్‌పై కుటుంబ సభ్యులు మానకొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అప్పు ఇచ్చిన వ్యక్తికి మృతుడు ప్రశాంత్‌కి మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలపై కూడా ఆరా తీస్తామని పోలీసుల తెలిపారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Financial problem, Karimnagar, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు