హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad ఉప ఎన్నిక ఫలితం ఇదేనా! -డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా?

Huzurabad ఉప ఎన్నిక ఫలితం ఇదేనా! -డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ చరిత్రలో సుదీర్ఘంగా ప్రచారం సాగిన ఎన్నికగా హుజూరాబాద్ బైపోల్ని నిలవనుంది. మరో తొమ్మిది రోజుల్లో పోలింగ్ జరుగనున్నా.. సర్వేయర్లకు, పార్టీలకు ఓటరు నాడి ఏమిటన్నటి అంతుచిక్కడం లేదు. అయితే, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇదే అనడంలో మాత్రం ఎవరికీ సందేహాల్లేవు....

ఇంకా చదవండి ...

  (P.Srinivas,News18,Karimnagar)

  సరిగ్గా మరో ఆరు రోజుల్లో ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియనుంది. తొమ్మి రోజుల్లో, అంటే ఈనెల 30న పోలింగ్ జరుగనుంది. తెలంగాణ చరిత్రలో సుదీర్ఘంగా ప్రచారం సాగిన ఎన్నికగా ఇది నిలిచిపోనుంది. ఉప ఎన్నికలో అన్ని పార్టీలు డబ్బులు ఎదజల్లడం కామనే అయినా.. వ్యక్తిగ ప్రతిష్టకు సవాలుగా మారిన హుజూరాబాద్ లో ఏకంగా కోట్ల కొద్దీ కుమ్మరిస్తున్నారు. ప్రచారం చివరి దశకు చేరినా ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడంలేదు. అయితే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమిటనే విషయంలో మాత్రం గత చరిత్రనే క్లారిటీ ఇస్తున్నది. అవును, హుజూరాబాద్ లో విజేతను నిర్ణయించేది అక్కడి మహిళా ఓటర్లేమరి..

  హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సతీమణి జమునను ఫ్రంట్ లైన్ లో నిలబెట్టడానికి, టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు నిత్యం మహిళలను వెంటబెట్టుకుని క్యాంపెయిన్ చేస్తుండటానికి బలమైన కారణముంది. హుజూరాబాద్ లో మహిళా ఓటర్లే నిర్ణయాకశక్తులు కావడం వల్లే అన్ని పార్టీలూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రచారంలోనూ వారిని అగ్రభాగాన నిలుపుతున్నాయి. గృహిణులకు బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ కాబట్టే టీఆర్ఎస్ తన ప్రచారంలో గ్యాస్ సిలిండర్ ను విరివిగా వాడుతున్నది. బీజేపీ కూడా నారీలోకానికి అవసరమైనవన్నీ ఇస్తామని వాగ్ధానాలు చేస్తున్నది.

  ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2.36లక్షల మంది ఓటర్లున్నారు. అయితే కొత్త ఓటర్లుగా నమోదైనవారి సంఖ్య 10వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఓటర్లలో పురుషులు 1,17,779(1.17లక్షలు)కాగా, మహిళా ఓటర్లు 1,19,093(1.9లక్షల) మంది ఉన్నారు. పురుషుల కంటే ఎక్కువగా ఉన్న మహిళా ఓటర్లే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళలు ఏ పార్టీకి ఓటేస్తే ఆ అభ్యర్థే గెలిచారు. ప్రధానంగా హుజూరాబాద్ , జమ్మికుంట , కమలాపూర్ మండలాల్లో మహిళా ఓటర్ల డామినేషన్ ఎక్కువగా ఉంది.

  హుజూరాబాద్ లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మహిళలే అయినా, ప్రధాన పార్టీల అభ్యర్థులంతా పురుషులే కావడం గమనార్హం. ఇ ఈనెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. పురుషులు, స్రీలను పక్కనపెడితే, హుజూరాబాద్ లో తొలిసారి ఓ థర్డ్ జెండర్‌ ఓటు హక్కును పోదారు. రొంటాల కుమారి అనే థార్డ్ జెండర్ తొలిసారి అక్కడ ఓటేయబోతున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి 72 గంటల ముందే, అంటే మూడు రోజుల ముందే ప్రచారపర్వం ముగియనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

  Published by:Madhu Kota
  First published:

  Tags: Huzurabad, Huzurabad By-election 2021

  ఉత్తమ కథలు