హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ideal Womens: గరిటె పట్టే చేతులతో స్టీరింగ్ పట్టిన మహిళలు.. ఇలా మారడానికి కారణాలెన్నో.. వివరాలివే..

Ideal Womens: గరిటె పట్టే చేతులతో స్టీరింగ్ పట్టిన మహిళలు.. ఇలా మారడానికి కారణాలెన్నో.. వివరాలివే..

ఆటో డ్రైవర్లుగా మారిన మహిళలు

ఆటో డ్రైవర్లుగా మారిన మహిళలు

Ideal Womens: పనిచేస్తేకానీ పూటగడవని పరిస్థితి..  అయితే అందరిలా కూలీపనికి పోతే వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోవు. ఏదైనా కొత్తగా చేయాలి . మగవారికి దీటుగా సంపాదించాలని సంకల్పించారు . బతుకు పోరాటంలోకి దిగారు. ఇన్నాళ్లు వంటింట్లో గరిటెపట్టిన చేతులతో ఆటో స్టీరింగ్ పట్టారు. తక్కువ సమయంలో డ్రైవింగ్ నేర్చుకున్నారు. రోడ్డుపై రయ్ .. రమ్మంటూ దూసుకెళ్తున్నారు.

ఇంకా చదవండి ...

(P.Srinivas,News18,Karimnagar)

పనిచేస్తేకానీ పూటగడవని పరిస్థితి..  అయితే అందరిలా కూలీపనికి పోతే వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోవు. ఏదైనా కొత్తగా చేయాలి . మగవారికి దీటుగా సంపాదించాలని సంకల్పించారు . బతుకు పోరాటంలోకి దిగారు. ఇన్నాళ్లు వంటింట్లో గరిటెపట్టిన చేతులతో ఆటో స్టీరింగ్ పట్టారు. తక్కువ సమయంలో డ్రైవింగ్ నేర్చుకున్నారు. రోడ్డుపై రయ్ .. రమ్మంటూ దూసుకెళ్తున్నారు. కరీంనగర్ , గోదావరిఖనిలో నలుగురు మహిళలు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తుండగా .. ఇద్దరు మున్సిపల్ పారిశుధ్య వాహనాలు నడుపుతున్నారు. మరో ఇద్దరు ప్యాసింజర్ ఆటో నడుపుకుంటూ .. బతుకుబండిని లాగుతున్నారు. ఈ డ్రైవరక్కల కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత జీవన పరిస్థితిపై న్యూస్18 తెలుగు ప్రత్యేక కథనం..

Shocking Incident: ఎంత పని చేశావమ్మా.. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఇలా జరిగేది కాదు కదా..


విధివెక్కిరించిన ఆమెకు ఆటో బతుకుదారి చూపింది. కన్నకూతురు భవిష్యత్తే లక్ష్యంగా స్టీరింగ్ పట్టింది . తక్కువరోజుల వ్యవధిలో డ్రైవింగ్ నేర్చుకుంది. కరీంనగర్ మొట్టమొదటి మహిళా ఆటోడ్రైవర్ అయ్యింది సుభాష్ నగర్ కు చెందిన రెడ్డిమల్ల సంగీత. సుభాష్ నగర్ కు చెందిన రాజుతో సంగీతకు చిన్నవయసులోనే వివాహమైంది. కూతురు పౌర్ణమి జన్మించింది. కొద్దినెలలకే రాజు చనిపోయాడు. అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. ఏం పనిచేయాలో తెలియని పరిస్థితి. ఇంట్లో మామ , మరిది ఆటో నడిపేవారు. తనకూ ఆటోనే నడపాలనే ఆలోచన వచ్చిందని అందుకే వెంటనే డ్రైవింగ్ నేర్చుకున్నట్లు పేర్కొంది.

అతడికి 25 ఏళ్లు.. పెళ్లైన 7 రోజులకే ఉపాధి కోసం సిటీకి వెళ్లాడు.. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసరికి అతడి భార్య..


పురుషులు మాత్రమే నడిపే ఆటోను నువ్వెలా నడు పుతావని అందరూ భయపెట్టినా వెనకడుగు వేయలేదు ఆమె . ఆటోను రోజుకు రూ .300 చొప్పున అద్దెకు తీసుకుని ఏడేళ్లుగా నడుపుతోంది . ఆటో నడిపితే రూ . 600 వస్తాయి . రూ .300 అద్దె చెల్లించగా , మరో రూ .300 మిగులుతాయి . ఆ సొమ్ముతోనే ఇంటి అద్దె , నిత్యావసరాలు , ఇతర ఖర్చులతో పాటు పాపను చదివిస్తోంది . లోకల్లోనే కాకుండా కిరాయిలు దొరికితే వరంగల్ , గోదావరిఖని , జగిత్యాల , సిరిసిల్ల వరకు కూడా ప్యాసింజర్లను తీసుకెళ్తానని చెబుతోంది సంగీత . ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆటో నడుపుతుంది .ఇంకా గర్రెపల్లి గ్రామానికి చెందిన వల్లెపు నిర్మలకు కరీంనగర్కు చెందిన సాగర్తో వివాహమైంది . వీరిది పేదకుటుంబం .

Sadist Fathers: కన్న బిడ్డలపైనే కసాయి తండ్రుల కర్కశత్వం.. కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..


ఇద్దరూ కూలీపనిచేస్తే కానీ పూటగడిచే పరిస్థితి లేదు . సాగర్ గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలిగా పని చేసేవాడు . వచ్చే ఆదాయం సరిపోయేది కాదు . కుటుంబపోషణ కష్టంగా మారింది . ప్రత్యా మ్నాయ ఉపాధివెతకడం ప్రారంభించారు . కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటోలు అందిస్తున్నారని తెలుసుకున్నారు . మంజూరు అయితే తానే నడిపిస్తానని నిర్మల స్వయంగా ఆటో నడపడం నేర్చుకుంది.

ఓనర్ కమ్ డ్రైవర్ పథకంలో మున్సిపల్ ద్వారా నిర్మలకు ఆటోకూడా మంజూరు చేశారు. రెండు సంవత్సరాలుగా స్వచ్ఛ ఆటోను నడుపుకుంటూ భర్తకు తోడుగా .. కుటుంబానికి ఆసరాగా ఉంటోంది . భార్యాభర్తలు ఇద్దరూ ఒకేఆటోను నడు పుకుంటూ జీవనం సాగిస్తున్నారు . ప్రతీరోజు కరీంనగర్ 40 వ డివిజన్లోని మోహర్ నగర్ , వివేకానందంకాలనీ , వీడీవోకాలనీవరకు ఇంటింటికీ తిరుగుతూ .. చెత్తను సేకరిస్తుంటారు.

First published:

Tags: Trending news, Viral

ఉత్తమ కథలు