హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : భర్త మర్డర్‌కి భార్యే స్కెచ్ .. 7సార్లు ప్రయత్నం చేసి సక్సైస్ అయింది ..ఎందుకు చేసిందంటే

Crime news : భర్త మర్డర్‌కి భార్యే స్కెచ్ .. 7సార్లు ప్రయత్నం చేసి సక్సైస్ అయింది ..ఎందుకు చేసిందంటే

KARIMNAGAR MURDER

KARIMNAGAR MURDER

సార్లు హత్యకు ప్రయత్నం చేసిన కీ లేడి ... హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు ... పథకం ప్రకారమే ప్రియుడుతో కలిసి హత్య..

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  ప్రియుడి ప్రేమ కోసమే కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపడానికి ప్రయత్నాలు చేసిన ఖిలాడీ లేడీ (Lady)బాగోతాల్ని బయటపెట్టారు పోలీసులు. తన వివాహేతర సంబంధాని(Extramarital affair)కి అఢ్డుగా ఉన్నాడని అతడ్ని అడ్డుతొలగించుకుంటే ప్రియుడితో గడపవచ్చనే నీచమైన ఆలోచనతో పెద్దపల్లి (Peddapally)జిల్లాకు చెందిన ఓ వివాహిత భర్తపై ఒకటి రెండు సార్లు కాదు ఆరు సార్లు హత్యాయత్నానికి పాల్పడింది. ప్రతిసారి తప్పించుకోవడంతో ఏడో సారి డైరెక్ట్‌గా తుపాకీ(Gun)తో కాల్చి గుర్తు తెలియని వ్యక్తులపై నెట్టేసింది. సంచలనం సృష్టించిన ఈకేసును లోతుగా విచారించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

  Telangana : ఆర్గానిక్ సాగుతో పాటే అమ్మ,నాన్న అంటే కూడా అతనికి ప్రాణం .. అందుకే ఏం చేశాడో తెలుసా


  భర్త మర్డర్‌కి భార్యే స్కెచ్..

  రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గంగనగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు రాజేందర్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. సంచలనంగా మారిన ఈకేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. చెన్నూరు మండలం కృష్ణంపేట గ్రామానికి చెందిన బంధంరాజు , మృతుడి భార్య రవళి పదో తరగతి వరకు కలసి చదువుకున్నారు. ఆ తర్వాత రవళికి రాజేందర్ వివాహం జరిగింది. రీసెంట్‌గా ఇద్దరి మధ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మళ్లీ పరిచయం ఏర్పడటంతో ఎలాగైనా మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే భర్త ఉండగా రెండో వివాహం వీలు కాదని తెలుసుకొని తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది రవళి.

  లవర్‌పై మోజుతో ఘాతుకం..

  ప్రియుడు బంధంరాజుతో క్లోజ్‌నెస్ పెరిగిన తర్వాత రోజు తన భర్త రాజేందర్‌ డ్యూటీకి వెళ్లే సమయం చెబుతూ ఉండేది. నిందితుడు బంధంరాజు సైతం తాను నివసిస్తున్న గ్రామానికి చెందిన సయ్యద్ గులాం అనే వ్యక్తితో తన ప్రేమ వ్యవహారం చెప్పి రాజేందర్ హత్య చేయడానికి సాయం కోరాడు. అది చేస్తే జీవితాంతం రుణపడి ఉంటానని ప్రాధేయపడటంతో ముగ్గురూ కలిసి రాజేందర్‌ని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. మర్డర్‌ చేయాలన్న తొలి ప్రయత్నంలో రాజేందర్‌ నైట్ డ్యూటీకి వెళ్తుండగా బండరాయితో మోది చంపాలని చూశారు. అది వర్కవుట్ కాలేదు. మృతుడు మొదటి సారి తప్పించుకున్నాడు.

  Bandi Sanjay : ఢిల్లీ నుంచి గల్లీకి చేరిన లిక్కర్‌ స్కాం లొల్లి .. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌తో టెన్షన్  చంపేందుకు ఆరుసార్లు ప్రయత్నం..

  రెండో సారి నిందితురాలు, మృతుడి భార్య రవళి కృష్ణంపేటకు వచ్చిన సమయంలో గోదావరిఖని గంగానగర్‌లో రాజేందర్ ఇంటికి వెళ్లిన రాజు , సయ్యద్ కరెంట్‌ షాక్‌ పెట్టి చంపాలని చూశారు. అది కూడా విఫలమవడంతో రాజు సయ్యద్ స్నేహితులు వాజిద్ , ఇమ్రాన్‌కు కూడా తన ప్రేమ విషయాన్ని తెప్పి సాయం కోరాడు. అదే రోజు నైట్‌ డ్యూటీకి వెళ్తుండగా బైక్‌ని తన్ని కిందపడగానే రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు.స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. నాల్గో సారి రాజేందర్ బైక్‌ ఎక్కి వెనుక కూర్చొని కొట్టి చంపాలని ప్లాన్ వేశారు. ఆరుసార్లు చంపడానికి ప్రయత్నించినప్పటికి ఏదో రకంగా తప్పించుకోవడం, స్వల్ప గాయాలతో బయటపడటంతో డైరెక్ట్‌గా చంపడమే బెటర్‌ అని భావించారు.

  ఏడో సారి తుపాకీ బుల్లెట్ దించిన ప్రియుడు..

  మద్యం తాగుతుండగా నీలాల శ్రీనివాస్ అనే వ్యక్తి తుపాకీ గురించి సమాచారం ఇవ్వడంతో బీహార్‌లో 1 లక్ష 50 వేల రూపాయలకు ఓ పిస్టోల్ కొనుగోలు చేశాడు. ఆరుసార్లు చంపడానికి ప్రయత్నించి విఫలమైన రాజు ఏడోసారి గురి తప్పకూడదని భావించి సంచలన నిర్ణయించుకొని పథకం ప్రకారం ఈ నెల 19 వ తేదీన రాత్రి 10:30 గంటలకు బంధం రాజు తన స్నేహితుడు సయ్యద్‌ను బైక్‌పై గోదావరిఖనికి వెళ్లారు. రాత్రి రెండు గంటల సమయంలో రాజు రవళి కి ఫోన్ చేసి తలుపు తీయమని చెప్పాడు . దీంతో ఇంట్లోకి వెళ్లిన నిందితులు బెడ్ పై పడుకొని ఉన్న రాజేందర్ కణతి భాగంలో రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.రాజేందర్‌ చనిపోయాడని తెలిసి అక్కడి నుంచి నిందితులు పరార్ అయ్యారు.వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసును చాకచక్యంగా విచారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి ఓ తుపాకీ, 9బుల్లెట్లు, 3సెల్ ఫోన్లు, ఒక పల్సర్‌ బైక్‌ని స్వాధీనం చేసుకున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Peddapalli, Telangana crime news, Wife murdered

  ఉత్తమ కథలు