హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news: తెల్లవారు జామునే తల్లీ,కూతురిపై కత్తులతో దాడి .. ఎందుకు చేశారో తెలిస్తే షాక్ అవుతారు

Crime news: తెల్లవారు జామునే తల్లీ,కూతురిపై కత్తులతో దాడి .. ఎందుకు చేశారో తెలిస్తే షాక్ అవుతారు

Murder Attempt

Murder Attempt

Murder Attempt: కరీంనగర్ జిల్లాలో దుండగులు దారుణానికి తెగబడ్డారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తెల్లవారు జామున ఇంట్లోకి చొరబడి తల్లీ,కూతురుపై దాడి చేశారు. ఇద్దరిలో ఒకరు మృతి చెందారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  కరీంనగర్(Karimnagar)జిల్లాలో దుండగులు దారుణానికి తెగబడ్డారు. తిమ్మాపూర్(Timmapur)మండలం రామకృష్ణకాలనీ(Ramakrishna Colony)లో ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇంట్లో ఉన్న తల్లీ,కూతురిపై కత్తులతో పొడవడంతో గుజ్జుల సులోచన( Gujjula Sulochana)అనే యువతి స్పాట్‌లో మృతి చెందింది. తీవ్రంగా 8గాయపడిన సులోచన తల్లి బాలవ్వ(Balavva)ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

  Munugodu : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజాగాయకుడు .. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా గద్దర్ ప్రచారం షురూ

  కూతురు మృతి..తల్లికి గాయాలు..

  తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో తెల్లవారు జామున దారుణం జరిగింది . గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటిపై దాడి చేసి తల్లీకూతుర్లపై కత్తులతో దాడి చేశారు . ఈహాఠాత్పరిణామాంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు . గ్రామానికి చెందిన గుజ్జుల సులోచన , ఆమె తల్లి బాలవ్వపై దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు . ఈ ఘటనలో సులోచన అక్కడికక్కడే హతమవ్వగా .. బాలవ్వకు తీవ్రగాయాలు అయ్యాయి . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలవ్వను ఆస్పత్రికి తరలించారు.

  మహిళలపై దుండగుల దాడి..

  దుండగులు కత్తులతో దాడి చేయడానికి వచ్చిన సమయంలో తల్లీ, కూతురు ఎవరు దాడి చేశారు .. ? ఎందుకు చేశారు .. ? అనేది తెలియాల్సి ఉంది . పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు . దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Telangana crime news

  ఉత్తమ కథలు