లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య(Suicide) చేసుకుంది. సెల్ఫీ వీడియో(Selfie Video) రికార్డ్ చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ లోని కాపువాడలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బావ కనకయ్య లైంగికంగా వేధిస్తుండడం తో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో లో అరుణ వెల్లడించింది. సెల్ఫీ వీడియో తో పాటుగా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో లో అరుణ ఏం మాట్లాడారంటే.. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి లైంగిక వేధింపులు పాల్పడ్డాడని.. పిల్లలకు నీ గురించి తప్పుగా చెప్పుతానని బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలిపింది. తన బావ ఇలాంటి పనులకు పాల్పడ్డట్లు ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొంది. అతడిని ప్రతీ సారి ప్రతి ఘటిస్తున్నా.. ఇష్టం వచ్చినట్లు తిట్టేవాడని.. కొట్టేవాడని వాపోయింది.
ఇక అతడు పెట్టే వేధింపులు భరిచలేకపోతున్నానని వాపోయింది. మిషిన్ కుట్టుకుంటూ పిల్లలను పోషించుకుంటు పరువుగా బతికే నేను.. తనకు లొంగాలని బెదరించడంతో పాటు.. డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడని చెప్పింది.
అంతే కాకుండా.. తనకు 30 వేలు అప్పు ఇచ్చినట్టు అబద్దాలు చెబుతూ లొంగదీసుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందరి ముందు ఇలాంటి పనులు చేస్తూ. తన భర్తా బయటకు వెళ్లిన సమయంలో వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది.
పోలీస్ స్టేషన్‌కి పోతే పరువు పోతుందని.. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. పిల్లలకి అన్యాయం చేసి పోతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అరుణ. సూసైడ్ లెటర్ రాసి పెట్టి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లైంగిక వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎవరి జోలికి పోకుండా జాగ్రత్తగా బతకాలంటూ తన ముగ్గురు పిల్లలకు చివరి మాటగా చెప్పింది బాధితురాలు. వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహిత మరణానికి కారణమైన కనకయ్య కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అనారోగ్యంతో వివాహిత మృతి చెందిన సంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కులకచర్ల గ్రామానికి చెందిన వడ్డె తిర్మలయ్య కుమార్తె వడ్డె అలవేలు (21) గత 18నెలల క్రితం మహ్మాదాబాద్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన వడ్డె లాలుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి అయిన కొన్ని రోజుల తరువాత అలవేలుకు పసిరికలు వచ్చాయని, అత్తవారు ఆస్పత్రికి చూపించలేదన్నారు. వారం రోజుల క్రితం తన బిడ్డను కులకచర్లకు తీసుకొచ్చి ఆస్పత్రికి చూయించినట్లు తండ్రి తిర్మలయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Karimnagar