Jagtial: పెద్దపులిని చూపిస్తానని పిల్లల్ని తీసుకెళ్లిన తల్లి.. చివరకు అంతులేని విషాదం..

ప్రతీకాత్మక చిత్రం

రాయికల్‌ మండలం కిష్టంపేట గ్రామంలో కస్తూరి లావణ్య, సంపత్ దంపతులకు ఇద్దరు కుమారులు.శుక్రవారం కూలీ పనికి వెళ్లిన లావణ్య, సంపత్‌ దంపతులు కూలీ పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు.

  • Share this:
    ఓ మహిళ తన ఇద్దరు కొడుకులను పెద్దపులి చూపిస్తానని చెప్పి తనతో పాటు తీసుకెళ్లింది. గ్రామ శివారులోకి వెళ్లాక పిల్లలను బావిలోకి తోసేసి.. ఆ తర్వాత తాను కూడా దూకింది. ఈ ఘటనలో తల్లి, పెద్దకొడుకు మృతిచెందగా.. చిన్న కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం‌లో చోటుచేసుకుంది. వివరాలు.. రాయికల్‌ మండలం కిష్టంపేట గ్రామంలో కస్తూరి లావణ్య, సంపత్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు పేరు హర్షవర్దన్, పెద్ద కొడుకు పేరు గణేష్. శుక్రవారం కూలీ పనికి వెళ్లిన లావణ్య, సంపత్‌ దంపతులు కూలీ పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొంతసేపటికి లావణ్య.. పిల్లలకు పెద్దపులి చూపిస్తానని చెప్పి గ్రామ శివారులోకి తీసుకెళ్లింది.

    అక్కడ ఉన్న ఓ వ్యవసాయ బావి వద్దకు చేరుకుంది. అనంతరం పిల్లల్ని బావిలోకి తోసేసి, ఆమె కూడా దూకినట్టుగా భావిస్తున్నారు. అయితే తల్లి, పెద్ద కొడుకు బావిలో పడిపోయారు.. చిన్నకొడుకు హర్షవర్దన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున బావి వద్దకు చేరుకున్నారు. లావణ్య, గణే‌ష్‌లను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వారు అప్పటికే మృతిచెందారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిచారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం జగిత్యా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇలా ఎలా జరిగిందో అంతుపట్టడం లేదని పలువురు గ్రామస్తులు చెప్పారు.



    ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ చేపట్టారు. లావణ్య కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇలా చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అంతకు ముందు రోజే హర్షవర్దన్ పుట్టిన రోజు జరిగింది. అమ్మ, నాన్న కలిసి తనతో కేక్ కట్ చేయించారని హర్షవర్దన్ చెప్పాడు. పెద్దపులిని చూపెడతానని తీసుకొచ్చిన అమ్మ..తనను, అన్నను బావిలోకి తోసిందన్నాడు. అయితే తాను గట్టువద్దే పడిపోయాని చెప్పాడు.
    Published by:Sumanth Kanukula
    First published: