Home /News /telangana /

KARIMNAGAR WOMAN COMPLAINS TO KARIMNAGAR POLICE AGAINST HER HUSBAND FOR CHEATING ON HER BY MARRYING HER SECOND TIME SNR KNR

Crime news : అంకుల్ వలలో పడిన అమ్మాయి.. పెళ్లి చేసుకొని అంత పని చేశాడు

(CHEATER)

(CHEATER)

Cheater: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి. ఆమె హిందూ..అతను ముస్లిం. ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడ్డాడు. మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరగానే ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.

(P.Srinivas,New18,Karimnagar)
నిన్ను ప్రేమించాను..నీకోసం మతం కూడా మార్చుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతడ్ని నమ్మింది. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దని చెప్పి మరీ పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల్లోనే అతడి నిజస్వరూపం బయటపడింది. మోసగాడి(Cheater)తో సర్దుకుపోదామనుకుంటే వాడు పెట్టే టార్చర్ (Torture)భరించలేక చివరకు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. కరీంనగర్‌(Karimnagar)లో ఓ నయవంచకుడి వలలో పడిన మహిళ డబ్బు, నగలు పోగొట్టుకొని ఏడుస్తోంది.

Hyderabad : ఆగస్ట్ 4న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోలీస్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం



అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి అనే యువతి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా కరీంనగర్‌కు చెందిన ఫారూఖ్‌ అలీతో పరిచయం ఏర్పడింది. ఫారూఖ్‌ దుర్గారెడ్డిని ట్రాప్ చేయడం కోసం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోకపోతే చస్తానంటూ ఆమెను నమ్మించాడు. దాంతో బాధితురాలు గుడ్డిగా అతడి వలలో పడింది. ఫారూఖ్ ప్రేమలో పడిన దుర్గారెడ్డి అతడితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమైంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దని చెప్పి ప్రేమ వివాహం చేసుకుంది.



ప్రేమ పేరుతో వల ..
ఇంట్లో బంగారం, నగదు తీసుకొని వచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న ఫారూఖ్‌ దుర్గారెడ్డిని పెళ్లి పేరుతో భార్యను చేసుకొని ఆమె బంగారం, నగదు మూడు లక్షల రూపాయలను తీసుకున్నాడు. ఈ మొత్తం ప్రేమ, పెళ్లి వ్యవహారం నడిపించేందుకు ఫారూఖ్‌ తనకు గతంలోనే వివాహం జరిగిన విషయాన్ని రహస్యంగా ఉంచాడు. భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన దుర్గారెడ్డి మోసపోయినట్లుగా తెలుసుకొని ఫారూఖ్‌ని నిలదీసింది. నిజాన్ని ఒప్పుకున్న ఫారూక్‌ అందరం కలిసి ఉందామని ఆమెకు సర్ధి చెప్పాడు.

పెళ్లి పేరుతో మోసం..
ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన ఫారూఖ్ చివరకు తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీని కూడా మోసం చేయాలని చూడటంతో బాధితురాలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్‌పై దాడి చేశారు. దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో దుర్గారెడ్డిని వదిలించుకొని మొదటి భార్య, పిల్లలతో ఫారూఖ్ అలుగునూర్‌లో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు భర్త ఉంటున్న ఇంటికి వచ్చి న్యాయం చేయమని నిరసనకు దిగింది. దుర్గారెడ్డికి స్థానిక నాయకులు కూడా అండగా నిలిచారు. ఫారూఖ్ చేసిన మోసంపై ఎల్‌ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Karimnagar, Love cheating, Telangana News

తదుపరి వార్తలు