Home /News /telangana /

KARIMNAGAR WITH THE MLC ELECTION SCHEDULES OF LOCAL BODIES YET TO BE RELEASED HOPEFULS ARE HOPING TO ALLOT THEMSELVES A TICKET KNR VB

Telangana Politics: తెలంగాణలో మరో సమరణానికి మొదలైన సందడి.. టీఆర్ఎస్ నుంచి వాళ్లకే టికెట్లు..?

సీఎం కేసీఆర్ (ఫైల్)

సీఎం కేసీఆర్ (ఫైల్)

Telangna Politics: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం అను కూలంగా రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పూర్వ వైభవం కోసం దూరమవుతున్న కొన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టే ఆలోచనలో ఉంది . స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి .

ఇంకా చదవండి ...
  (P.Srinivas,News18,Karimnagar)

  హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం అను కూలంగా రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పూర్వ వైభవం కోసం దూరమవుతున్న కొన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టే ఆలోచనలో ఉంది . స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి . అలాగే ఎమ్మెల్యే కోటా నుంచి ఇద్దరికి చోటు దక్కే అవకాశాలు ఉండటంతో ఉమ్మడి జిల్లా నుంచి మండలిలో నలుగురుకు చోటు దక్కనుంది . ప్రస్తుతం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మండలి విప్ గా ఉన్న భానుప్రసాద్ రావు , నారదాసు లక్ష్మన్రావులు ప్రాతి నిథ్యం వహిస్తున్నారు .

  Google Home Remote: ఆండ్రాయిడ్ యూజర్లకు మరో యాప్ బేస్డ్ గూగుల్ టీవీ రిమోట్‌ ఆప్షన్.. వివరాలివే..


  తెలంగాణ శాసన మండలిలో స్థానిక సంస్థల నియోజక వర్గాల కోటా నుంచి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం జనవరి 4 తో ముగుస్తుంది . పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల సంఘం షెడ్యూ లు విడుదల చేసింది . ఈనెల 16 న నోటిఫి కేషన్ విడుదల కానుండగా డిసెంబర్ 10 న ఎన్నికలు జరగనున్నాయి . ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న నారదాసు లక్ష్మ న్రావు , భానుప్రసాదావులు సీఎం కేసీఆర్కు వీర విధేయులు . వీరు చెరో రెండు సార్లు ప్రాతినిథ్యం వహించ డంతో ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించవచ్చన్న ప్రచారం జరుగుతుంది జిల్లాల పునర్విభజనకు ముందు స్థానిక సంస్థల కోటా కింద ఉమ్మడి జిల్లాకు ఒక స్థానమే ఉండేది . ఈ స్థానానికి భాను ప్రసాద్ ఎమ్మెల్సీ ఉండగా తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు స్థానాలు రావడంతో 2016 లో భాను ప్రసాద్లవుతోపాటు నారదాసు లక్ష్మన్ రావు ఎన్నికయ్యారు .

  Best 5G Smartphones: తక్కువ ధరలో బెస్ట్​ 5జీ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా.. అయితే వీటిపై ఓలుక్కేయండి..


  అంతకు ముందు నారదాసు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ చేశారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు భాను ప్రసారావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు . రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్లో చేరి తిరిగి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికయ్యారు . నారదాసు లక్ష్మన్రావు ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్లో ఉన్నారు . ఇందులో నార దాసు బీసీ సామాజిక వరంనకు చెందిన వారు కాగా , భానుప్రసాదరావు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓసీ సామాజిక వర్గం . ఈసారి స్థానిక సంస్థల కోటాలో ఇద్దరిని మార్చుతారా , కొనసాగిస్తారా అన్న చర్చ అప్పుడే మొదలైంది . సీఎం కేసీఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉండటంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి11మంది ఆశావ హులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు . హుజూరాబాద్ ఉపఎన్నికలో రెడ్డి సామాజిక వర్గంనకు చెందిన ఓట్ల శాతం అనుకూలంగా రాకపోవడంతో స్థానిక సంస్థ కోటా నుంచి ఒకరికి అవకాశం కల్పించాలని చూస్తున్నట్లు తెలిసింది .

  ఈ క్రమంలో చొప్పదండి నియోజవర్గంన కు చెందిన కొత్త జైపాల్ రెడ్డిని పరిశీలిస్తు న్నట్లు తెలిసింది . కొత్త జైపాల్రెడ్డికి అవకాశం కల్పిస్తే 2023 ఎన్నికల్లో చొప్పదండి కరీంనగర్ అసెంబ్లీ నియోజవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం దగ్గరవుతుందని భావిస్తున్నట్లు తెలిసింది . ప్రస్తుతం ఉన్న నారదాసు లక్ష్మన్రావు బీసీ సామా జిక వర్గంనకు చెందిన వాడు కనుక ఆయన ను మార్చితే అదే సామాజిక వర్గంనకు చెందిన ఎల్లాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు , కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడు వీర్ల వెంకటేశ్వర్రావు పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది . బీసీ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్య నారాయణ గౌడ్ గత కొన్ని సంవత్సరాలుగా నామినేటెడ్ పదవీ ఆశలో ఉండ టంతో ఆయన పేరును కూడా పరిశీలిస్తు న్నట్లు తెలిసింది . మైనార్టీల నుంచి గతంలో జడ్పీలో కో ఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన ఉద్యమకాలం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న మహ్మద్ జమీల్ ఉద్దీన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది . కిమ్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ పి . రవీందర్ రావు సైతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు .

  Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


  తెలు గుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన రవీందర్ రావు తెలంగాణ ఆవిర్భావం తరువాత టీఆర్ఎస్లో చేరారు . 2019 లో ఎంపీ వినోద్ కుమార్ కు ఎన్నికల ఏజెంట్ గా పనిచేశారు . ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కమలాపూర్ ఇన్చార్జిగా పనిచేశారు . మంత్రి హరీష్ రావు , కేటీఆర్ , వినోద్ కు మార్లకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది . టీడీపీ హయాంలో కాకతీయ విశ్వవిద్యాలయం సభ్యుడిగా పనిచేశారు.

  టీఆర్ఎస్కు పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారనే నమ్మకంతో ఉన్నారు . ఎమ్మెల్యే కోటా నుంచి రమణ , కౌశిక్ .. ఎమ్మెల్యే కోటా నుంచి భర్తీ చేయనున్న ఎమ్మెల్సీస్థానాలకు ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించి హుజూరా బాద్ ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్లో చేరిన ఎలగందుల రమణ , కాంగ్రెస్ నుంచి చేరిన పాడి కౌశిక్ రెడ్డిలకు చోటు ఖాయమన్న ప్రచారం జరుగుతుంది . పాడికౌశిక్ రెడ్డిని తొలుత గవర్నర్ కోటా నుంచి మంత్రిమండలి సిఫారసు చేసిం ది . గవర్నర్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇచ్చిన మాట మేరకు ఎమ్మె ల్యే కోటా నుంచి భర్తీ చేయాలని నిర్ణయిం చారు . ఎమ్మెల్సీ తో పాటు మండలి విప్ కూడా కట్టబెడుతారన్న ప్రచారం జరుగు తుంది . రమణ టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా సీఎం హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది .

  Airtel KYC Fraud: ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ముసుగులో మోసం.. ఆ కేటుగాళ్లు ఏం చేస్తారో తెలుసా..


  ఈ మేరకు ఆయనకు ఎమ్మెల్యే కోటా నుంచి అవకాశం కల్పిస్తు న్నట్లు తెలిసింది . స్థానిక సంస్థల నుంచి ఇద్దరు ఎంపిక ఎలాగు ఉంటుంది . ఎమ్మె ల్యే కోటా నుంచి ఇద్దరికి అవకాశం ఇస్తే ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీల సంఖ్య నాలుగుకు చేరుతుంది . నలుగురిలో ఒకరికి విప్ , ఒకరికి మంత్రి పదవి ఖాయమనే చర్చ కూడా నడుస్తుంది . రాజ్యసభకు .. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభకు కూడా ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికి చోటు లభిస్తుందని భావిస్తున్నారు . సీనియర్ నాయకుడైన ఉద్యమకారుడు నారదాసు లక్ష్మన్ రావు స్థానంలో ఎమ్మెల్సీ అవకాశం వేరే వారికి ఇస్తే ఆయనకు గౌరవం గా రాజ్యసభలో చోటు కల్పించే అవకాశా లు లేకపోలేదు . అలాగే రమణకు ఎమ్మెల్యే కోటా నుంచి వీలు కాకుంటే గతంలో ఎంపీ చేసిన అనుభవం ఉంది కనుక ఆయనకు కూడా చాన్స్ దక్కే అవకాశం ఉంది . ఏది ఏమైనా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు పదవుల పంట పండనుంది .దీనితో ఆశవహులు కూడ పెద్ద ఎత్తున కూడా తమకు పదవులు దక్కుతయాని ఎదిరి చూస్తున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Telangana, Telangana Politics

  తదుపరి వార్తలు