హోమ్ /వార్తలు /తెలంగాణ /

By elections: మునుగోడు ఉప ఎన్నికతో పాటు ఆ నియోజకవర్గానికీ ఉపఎన్నిక రానుందా..?

By elections: మునుగోడు ఉప ఎన్నికతో పాటు ఆ నియోజకవర్గానికీ ఉపఎన్నిక రానుందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మునుగోడుకు ఉప ఎన్నిక రానుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అలెర్ట్​ అయ్యాయి. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే తాజాగా మరో వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్​హాట్​గా మారింది. మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోందని.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Srinivas. P, News18, Karimnagar)


  తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy rajagopal reddy) ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి రాజీనామా చేయడం, బీజేపీలో చేరడం జరిగిపోయాయి. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక రానుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అలెర్ట్​ అయ్యాయి. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే తాజాగా మరో వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్​హాట్​గా మారింది. మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోందని. అదే కరీంనగర్​లోని ధర్మపురి నియోజవర్గం. ధర్మపురి (Dharmapuri) శాసనసభ ఎన్నికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు (Supreme Court)  కొట్టివేసింది.మంత్రి ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ సంజయ్్కషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్లతో కూడిన ధర్మాసనం విచారించింది.ఈశ్వర్ తరఫు న్యాయ వాదుల వాదనతో ఏకీభవించని ధర్మాసనం పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇస్తూ పిటిషన్​ను కొట్టివేసింది.


  Munugodu: ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన నిర్ణయం.. వివరాలివే


  2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కు మార్  పై 441 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.కొప్పుల ఈశ్వర్కు 70,579 ఓట్లు రాగా .. లక్ష్మణ్కుమార్కి 70,138 ఓట్లు వచ్చాయి.అయితే ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.మరోవైపు ఆ పిటిషన్ను కొట్టేయాలని మంత్రి కొప్పుల మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై విచారించిన హైకోర్టు మంత్రి పిటిషన్ను కొట్టివేసింది.దీంతో హైకోర్టు ఆర్డర్ను సవాల్ చేస్తూ కొప్పుల ఈశ్వర్త్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.రెండు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు మంత్రి కొప్పుల పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది .  తీర్పు వ్యతిరేకంగా వస్తే ఉప ఎన్నికే..


  ఒకవేళ హైకోర్టులో కొప్పులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవి కూడా పోనుంది. అలా జరిగితే మళ్ళీ ధర్మపురి నియోజకవర్గం లో మరో ఉప ఎన్నిక జరగనుందా..? లేకుంటే కాంగ్రెస్​ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కు ఎన్నికల నిబంధనల ప్రకారం MLA గా ప్రకటిస్తారా అనేది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.. లేదంటే  తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళితే  అన్ని నియోజకవర్గం తో పాటు ధర్మపురి  నియోజకవర్గనికి  కూడా సాధారణ ఎన్నికలు జరుగుతాయ.  అనేది ఇప్పుడు.. చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మునుగోడు లో బై ఎలక్షన్స్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. అలాగే ఇక్కడ కూడా జరిగితే బాగుంటదని ప్రజలు వేచి చూస్తునట్లు సమాచారం.. రానున్న రోజుల్లో ఇక్కడ రాజకీయం సమీకరణాలు పూర్తిగా మారానున్నట్లు సమాచారం..

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Elections, Karimangar

  ఉత్తమ కథలు