Home /News /telangana /

KARIMNAGAR WILL HUZURABAD SCENE BE REPEATED IN LOCAL BODY ELECTIONS WHAT DOES THE REPORT SAY KNR VB

Telangana MLC Elections: స్థానిక సంస్థల ఎన్నికలలో హుజురాబాద్ సీన్ రిపీట్ కానుందా..? ఆ రిపోర్టు ఏం చెబుతోంది..

election-commission

election-commission

Telangana MLC Elections: రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఇప్పటికే ఆరు ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్ , వరంగల్ జిల్లాల్లో ఒకటి చొప్పున రంగారెడ్డి , మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండేసి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు టీఆర్ఎస్ ఖాతాలో పడినట్టే లెక్క. కానీ.. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకుగాను 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,News18,Karimnagar)

    రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఇప్పటికే ఆరు ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్ , వరంగల్(Warangal) జిల్లాల్లో ఒకటి చొప్పున రంగారెడ్డి , మహబూబ్ నగర్ (mahabubnagar) జిల్లాల్లో రెండేసి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు టీఆర్ఎస్(TRS) ఖాతాలో పడినట్టే లెక్క. కానీ.. కరీంనగర్(Karimnagar) జిల్లాలో రెండు స్థానాలకుగాను 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులోనూ టీఆర్ఎస్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటీలో ఉండటం వెనుక పకడ్బందీ ప్రణాళిక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1326 ఓట్లు ఉండగా , టీఆర్ఎస్ కు 851 , కాంగ్రెస్ కు 213 , బీజేపీకు 105 , ఎంఐఎంకు 11 , స్వతంత్రులు 145 మంది ఉన్నారు. రవీందర్ సింగ్ కు కాంగ్రెస్ , బీజేపీ , స్వతంత్రులు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది .

    MLC Elections: అనుకున్నంత ఈజీ కాదట.. స్థానిక ఎమ్మెల్సీ గెలుపుపై తెరాసలో అంతర్మథనం.. కారణం ఇదే..


    వీరి ఓట్లతో గెలిచే అవకాశాలు కష్టమే. టీఆర్ఎస్ కు చెందిన కొంత మంది ఓటర్లు రవీందర్ సింగ్ కు మద్దతు ఇవ్వనున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ప్రకారం ప్రచారం జరుగుతోంది. ఇది అధికార పార్టీని గుబులు రేపుతున్నది. రెండు స్థానాలకుగాను ఒకటి టీఆర్ఎస్ మరొకటి రవీందర్ సింగ్ కు వేయాలని ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.

    Sad Incident: ఆమె ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయింది.. అతడు చేసిన ఆ పనికి.. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది..


    ఇప్పటికే టీఆర్ఎస్  మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ రంగంలోకి దిగగా 14మంది మాత్రమే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తప్పుకున్నారు. ఎలాగైనా రవీందర్ సింగ్ ను బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింపజేయాలని ప్రయత్నించిన ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. . అయితే , నామినేషన్ వేసిన రోజు నుంచే రవీందర్ సింగ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి , అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అధికార పార్టీ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతున్నది .

    Sub Inspector: ఆ ఎస్సై వివాహితతో బెడ్ పైనే రచ్చ రచ్చ.. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన భర్త.. తర్వాత ఏం జరిగిందో చూడండి..


    మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెనుక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది . టీఆర్ఎస్ క్యాంపులోని తన కోవర్టుల ద్వారా ఒక ఓటు టీఆర్ఎస్ , మరో ఓటు రవీందర్కు అన్నట్లు ప్రచారం చేయిస్తున్నట్లు సమాచారం . ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకున్న ఈటల హుజూరాబాద్ , మంథని , మానకొండూరు , కరీంనగర్ నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ఓట్లను రవీందర్ సింగ్ వైపు తిప్పే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

    Mini Family Story: భర్త చేసిన పనికి.. ఆమె ఇలా బిడ్డను ఎత్తుకొని బయటకు రావాల్సి వచ్చింది. ఏం జరిగిందంటే..


    శుక్రవారం సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసి నందున ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ చివరి వరకు పోటీలో ఉండి టీఆర్ఎస్కు షాకిచ్చారు .ఇక ఇదంతా చూస్తుంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు హుజురాబాద్ సీన్ రిపీట్ కాబోతుందని ఇప్పటికే గుసగుసలు వినబడుతున్నాయి. అంతా ఓకే అయితే ఈరోజు లేదా రేపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని రవీందర్ సింగ్ అనుచరులు చెబుతున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Karimnagar, Mlc elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు