(P.Srinivas,New18,Karimnagar)
రూపం కాదు గుణం ప్రధానం అని పెద్దలు పొద్దుపోక చెప్పలేదు. అనుభవపూర్వకంగానే చెప్పారని కరీంనగర్ జిల్లాలో ఓ దారుణ సంఘటన చూస్తే నిజమనిపిస్తుంది. పైపై సోకులు, టిప్,టాప్ డ్రెస్సులు, ఎర్రగా, బుర్రగా ఉంటే అమ్మాయిలే కాదు..ఆంటీలైనా ఇట్టే పడిపోతారని ఆ కిరాతకురాలు నిరూపించింది. పెళ్లి చేసుకొని భర్తతో పదేళ్లు కాపురం చేసిన తర్వాత మొగుడు నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి జీవించేందుకు చేయరాని నేరం చేసింది. కరీంనగర్(Karimnagar)జిల్లా గన్నేరువరం(Gunneruvaram)మండలం గుండ్లపల్లి(Gundlapalli)గ్రామానికి చెందిన లక్ష్మీ(Lakshmi)పెళ్లిళ్లలో పాటలు పాడుతూ ఉండేది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) గుంటూరు(Guntur)జిల్లాకు చెందిన వెంకట్‌రెడ్డిVenkatreddy పెళ్లిళ్లలో వంటలు చేస్తూ ఉండేవాడు. లక్ష్మీని చూసి ఇష్టపడి పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. వెంకట్‌రెడ్డిని లక్ష్మీ పెళ్లి చేసుకున్న లక్ష్మీ అతను నల్లగా ఉన్నాడని తనతో పాటలు పాడుతున్న మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
భర్త అందంగా లేడని..
నల్లగా ఉన్న భర్త వెంకట్‌రెడ్డిని వదిలించుకొని..ప్రియుడితో శాశ్వతంగా గడపాలని నిర్ణయించుకుంది లక్ష్మి. అందులో భాగంగనే రెండ్రోజుల క్రితం భర్త వెంకట్‌రెడ్డిని తానే అత్యంత కిరాతకంగా హతమార్చింది. శవాన్ని కనిపించకుండా చేసేందుకు ప్రియుడితో పాటు మరో ఇద్దరికి డబ్బులు ఇచ్చి వెంకట్‌రెడ్డి డెడ్‌బాడీని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామ శివార్లలో పాతి పెట్టించింది. మర్డర్ ప్లాన్ అంతా బాగానే వర్కవుట్ చేసింది. అయితే వెంకట్‌రెడ్డి శవాన్ని పాతిపెట్టిన ఇద్దరు కిరాయి మనుషుల మధ్య డబ్బుల విషయంలో తేడా రావడంతో విషయం బయటపడింది.
భార్య అంత పని చేసింది..
పాతిపెట్టిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో వెంకట్‌రెడ్డిని చంపి పాతిపెట్టిన విషయాన్ని చెప్పాడు. అంతే రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతుడు వెంకట్‌రెడ్డి భార్య లక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలీలో విచారించడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించింది. నల్లగా ఉన్నాడని భర్తతో తరచూ గొడవపడిన లక్ష్మీ ఇలాగైతే ప్రియుడితో కలిసి ఉండలేమని భావించి ఈ దారుణానికి తెగించినట్లు చెప్పింది.
జీవితాల్ని నాశనం చేసుకోవద్దు..
పరాయి పురుషుల వ్యామోహంలో పడి పచ్చని కాపురాలు కూల్చుకుంటున్నారు కొందరు వివాహితలు. అలాంటి వాళ్లను క్షమించే ప్రసక్తి లేదంటున్నారు పోలీసులు. వెంకట్‌రెడ్డి మర్డర్ కేసులో భాధితులకు కఠిన శిక్షపడేలా చూస్తామని పోలీసులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చూసైన వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణలకు ప్రేరేపిస్తాయో తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Karimnagar, Wife kill husband