హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news: తాళి కట్టిన భర్తకు తలకొరివి పెట్టిన భార్య .. కంటతడి పెట్టించిన దృశ్యం

Sad news: తాళి కట్టిన భర్తకు తలకొరివి పెట్టిన భార్య .. కంటతడి పెట్టించిన దృశ్యం

karimnagar great wife

karimnagar great wife

Sad news: ఐదోతనం పోగొట్టుకుని పుట్టెడు దుఖఃలో ఉన్న ఓ ఆడమనిషి గుండెను రాయిగా మార్చుకుంది. కట్టుకున్న వాడి రుణం తీర్చుకోవడానికి తాను ఏ ఆడది చేయని గొప్ప పని చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  కలకాలం తోడుంటానని అగ్ని సాక్షిగా మనువాడి వ్యక్తి శాశ్వతంగా తనను ఒంటిరిని చేసి వెళ్లిపోయాడు. నూరేళ్ల వైవాహిక జీవితం కాస్తా అడవి కాసిన వెన్నలగా మారింది. ఐదోతనం పోగొట్టుకుని పుట్టెడు దుఖఃలో ఉన్న ఓ ఆడమనిషి గుండెను రాయిగా మార్చుకుంది. కట్టుకున్న వాడి రుణం తీర్చుకోవడానికి తాను ఏ ఆడది చేయని గొప్ప పని చేసింది. తన జీవితం కన్నీటి సంద్రంగా మారినప్పటికి భర్త అంతిమ సంస్కారాలు, అంత్యక్రియల(Funeral)ను తానే దగ్గరుండి నిర్వహించి .. భార్యకు కొత్త నిర్వచనం ఇచ్చింది. కరీంనగర్(Karimnagar)జిల్లాలో జరిగిన ఓ విషాద గాధ స్థానికుల్నే కాదు మనసున్న ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది.

  Bathukamma sarees: కూరగాయల మూటలు, చేనుకు పరదాలుగా మారిన బతుకమ్మ చీరలు ..ఎక్కడ జరిగిదంటే..?

  భర్త రుణం తీర్చుకున్న భార్య..

  కరీంనగర్ జిల్లాలో ఓ సంఘటన గుండెల్ని పిండేస్తోంది. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన చల్లూరి పోచయ్య, కొమురమ్మ దంపతులు జీవనం సాగిస్తున్నారు. పోచయ్య గ్రామపంచాయతీలో సఫాయిగా పని చేస్తున్నాడు. అయితే ఈదంపతులకు సంతానం లేకపోవడంతో ఒకరికి తోడు మరొకరు అన్నట్లుగా వివాహం జరిగిన నాటి నుంచి కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. సోమవారం పోచయ్య చనిపోయాడు. పోచయ్యకు సంతానం లేకపోవడంతో కర్మకాండలు, అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన వాళ్లు లేకుండాపోయారు.

  భర్తకు తలకొరివి పెట్టిన భార్య..

  కొన్నేళ్ల క్రితం కొమురమ్మను పోచయ్య హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. పెళ్లి నాడు అగ్నిసాక్షిగా తన అర్ధాంగిని చేసుకున్నాడు. జీవితం నూరేళ్ల పండుగలా ఉంటుందనుకున్న పోచమ్మకు భర్త మరణం తీవని దుఖఃన్ని మిగిల్చింది. భర్త మరణంతో తాను ఒంటరిని అయ్యాననే విషయాన్ని పక్కనపెట్టి హిందూ సాంప్రదాయ ప్రకారం పోచమ్మే భర్త అంతిమ సంస్కారాలు దగ్గరుండి నిర్వహించింది. భర్త చితికి నిప్పు పెట్టి కన్నీటి వీడ్కోలు పలికింది. భార్య, కుటుంబ సభ్యుల రోదనలతో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి.

  Munugode | EC: నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక ..6న కౌంటింగ్ ..షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

  గ్రామంలో విషాదచాయలు..

  కట్టుకున్న భార్య భర్త దహన సంస్కారాలు నిర్వహించడం ..ఆతని రుణం తీర్చుకున్న సన్నివేశం గ్రామంలో ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు అందరితో కలుపుగోలుగా ఉంటే పోచయ్య మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంతిమ సంస్కారంలో గ్రామ సర్పంచ్ మోరె అనూష శ్రీనివాస్, ఎంపీటీసీ ఎస్ కే మోయిన్, గ్రామపంచాయతీ పాలక సభ్యులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Telangana News

  ఉత్తమ కథలు