హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG:మహిళ ప్రాణం తీసిన మామిడికాయ పచ్చడి..పచ్చని కాపురం అందుకు కూలిపోయిందా..

OMG:మహిళ ప్రాణం తీసిన మామిడికాయ పచ్చడి..పచ్చని కాపురం అందుకు కూలిపోయిందా..

(ప్రాణం తీసిన పచ్చడి)

(ప్రాణం తీసిన పచ్చడి)

OMG:పాడుబడ్డ పచ్చడి పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. నూరేళ్లు భర్తతో కాపురం చేసుకోవాల్సిన ఆడపిల్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేలా చేసింది. మామిడికాయ వల్ల ఇంతటి దారుణం జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

వెలకట్టలేని ప్రాణం విలువ తెలియక చాలా మంది క్షణికావేశంలో నూరేళ్ల జీవితానికి మధ్యలోనే  సమాధి కట్టుకుంటున్నారు. మనస్పర్ధలు, చిన్న చిన్న సమస్యలకు తీవ్ర మనస్తాపానికి గురై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కరీంనగర్‌(Karimnagar)జిల్లాలో ఓ వివాహితురాలు ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఆమె ప్రాణాలు తీసుకోవడం సంగతి పక్కన పెడితే సూసైడ్(Suicide)చేసుకోవడానికి గల కారణంపైనే అందరు చర్చించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు(Ramadugu)మండలం గోపాల్రావుపేట (Gopalravupeta)ఇరుకు తిరుపతి(Tirupati) సాయిప్రియ (Saipriya) భార్యభర్తలు. గురువారం మామిడి కాయ పచ్చడి (Mango Pickle)పెట్టే విషయంలో భార్యభర్తలిద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్తా చినికి చినికి గాలివాన కాస్త తుఫానుగా మారి కాపురాన్ని చిధ్రం చేసింది. పెళ్లై కొద్ది సంవత్సరాలే అవుతున్న జంట తాత్కాలికమైన మామిడి కాయ పచ్చడి కోసం ఘర్షణ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

మామిడికాయ పచ్చడి తెచ్చిన తిప్పలు..

భార్యభర్తల మధ్య మాటలు పెరిగాయి. తినే పచ్చడి విషయంలో గొడవ జరగడం, భర్త తన మాటకు ఎదురుచెప్పాడనే చిన్న అవమానంతో రగిలిపోయిన సాయిప్రియ వంటగదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అక్కడే ఉన్న భర్త తిరుపతి, తోటికోడలు కాపాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఇద్దరి శరీరాలు కాలిపోయాయి. అంతే కుటుంబ సభ్యులు చూస్తుండగానే మంటల్లో సాయిప్రియ కాలిపోయింది. తీవ్రగాయాలవడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లమన్నారు.

పచ్చని కాపురంలో అగ్గిరాజేసిన పచ్చడి..

అంబులెన్స్‌లో హైదరబాద్‌కు తీసుకువస్తుండగానే సాయిప్రియ మార్గం మధ్యంలో ప్రాణాలు విడిచింది. క్షణికావేశం, భర్త ఓ మాట అన్నాడనే చిన్నబుచ్చుకున్న సాయిప్రియ నూరేళ్ల పచ్చని కాపురంలో నిప్పులు పోసుకోవడమే కాకుండా తనకు తాను మరణ శిక్ష విధించుకోవడాన్ని భర్త తిరుపతి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య,భర్తల మధ్య తలెద్దిన వివాదమే సాయిప్రియ ప్రాణాలు తీసుకునేందుకు పురిగొల్పిందని రామడుగు ఎస్సై సాంబమూర్తి తెలిపారు.

పచ్చిడి కోసం నూరేళ్ల జీవితం త్యాగం..

రాను రాను భార్యభర్తల బంధాలు గాల్లో దీపల్లా, దారానికి వేలాడుతున్న గాలిపటాల్లా మారుతున్నాయి. బంధాలు బలపడుతూ అన్యోన్యంగా ఉండాల్సిన కాపురంలో పచ్చని మామిడి కాయ అగ్గిరాజేయడం ఆవిషయంలో ఓ వివాహిత ప్రాణాలు తీసుకుందన్న వార్త జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇలాంటి సున్నిత మనస్కులు కూడా ఉంటారా అని అందరు సింపతీ చూపిస్తున్నారు.

First published:

Tags: Karimnagar, Woman suicide

ఉత్తమ కథలు