హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: భార్య కొట్టిన దెబ్బకు భర్త మృతి..అంతకు ముందు ఏం జరిగిందంటే..

Peddapalli: భార్య కొట్టిన దెబ్బకు భర్త మృతి..అంతకు ముందు ఏం జరిగిందంటే..

(భార్య చేతిలో భర్త హతం)

(భార్య చేతిలో భర్త హతం)

Peddapalli:అతను భరించే భర్త కాదు..బాధించే భర్త. అందుకే ఆమె విసిగిపోయింది. అతను మద్యం తాగొచ్చి పెట్టే టార్చర్ తట్టుకోలేకపోయింది. మారతాడని ఆశపడినప్పటికి మార్పు రాకపోవడంతో క్షణికావేశంలో కొట్టి చంపింది.

(P.srinivas,News18,Karimnagar)

భరించలేకపోయింది. భర్త తాగొచ్చి పెడుతున్న చిత్రహింసలు సహించలేకపోయింది. మద్యం మత్తులో మాట్లాడే మాటలు, మైకంలో చేస్తున్న చేష్టలతో ఉడికిపోయింది. తాగుడికి బానిసై సంసారాన్ని పట్టించుకోకపోవడంతో విసిగిపోయింది. గత కొద్ది రోజులుగా భర్త పెట్టే వేధింపులు భరిస్తూ వచ్చిన ఆ ఇల్లాలు..చివరకు సహనం కోల్పోయింది. క్షణికావేశం ఆమెను హంతకురాలిగా మార్చింది. చనిపోయే వరకు తోడుంటానని పెళ్లి నాడు ప్రమాణం చేసిన భర్తను కొట్టి చంపేసింది. చివరకు కట్టుకున్న వాడ్నే కడతేర్చిందనే అపవాదును మూటగట్టుకుంది. పెద్దపల్లి (Peddapalli)జిల్లాలో దారుణం జరిగింది. విలేజ్ రామగుండం(Village Ramagundam)లో నివాసముంటున్న కల్లెడ మల్లేశం( Kalleda Mallesham)అనే 42 సంవత్సరాల వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. నిత్యం మద్యం తాగి భార్య స్వరూప(Swaroopa)ను వేధించసాగాడు. మల్లేశం పెట్టే టార్చర్(Torture)భరించలేకోయింది స్వరూప. భర్తతో వేగలేక అతను కొట్టే దెబ్బలు తాళలేక గురువారం పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం ఉదయం మళ్లీ విలేజ్‌ రామగుండంలోని తన ఇంటికి చేరుకుంది. భార్య తిరిగివచ్చిన విషయాన్ని గమనించిన మల్లేశం మరోసారి మద్యం తాగొచ్చి ఘర్షణపడ్డాడు. భార్యను చితకబాదాడు. మల్లేశం యముడిలా వేధించడంతో స్వరూప భరించలేకపోయింది. కోపంతో రగిలిపోయింది. క్షణికావేశం తట్టుకోలేక అక్కడే ఉన్న సిమెంట్ ఇటుక (Cement brick)తీసుకొని తలపై బలంగా కొట్టింది. మల్లేశం స్పాట్‌లోనే మృతి చెందాడు. దంపతుల మధ్య మధ్య జరిగిన గొడవలో కట్టుకున్న వాడు స్వరూప చేతిలో ప్రాణాలు విడవడం స్థానికంగా అందర్ని కలచివేసింది.

భర్తను కొట్టి చంపింది..

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకున్నారు. గొడవ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు సేకరించారు పోలీసులు. ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మల్లేశం, స్వరూప సంసారం రోజులు సాఫీగానే సాగిందని..కొన్నేళ్ల క్రితం మద్యానికి బానిస కావడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందని స్థానికులు పోలీసులకు తెలియజేశారు.

ఏ రేంజ్‌లో టార్చర్‌ పెట్టాడంటే..

మల్లేశం గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగుతూ భార్యను తిట్టడం, కొట్టడం చేస్తుండేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. భర్త పెట్టే వేధింపులను స్వరూప భరిస్తూ వచ్చిందన్నారు. గురువారం మల్లేశం స్వరూపను చితకబాదడంతో తలదాచుకునేందుకే పుట్టింటికి వెళ్లింది. తిరిగి శుక్రవారం ఉదయం వచ్చినప్పటికి అదే తీరు కొనసాగించడంతో విసిగిపోయి తిరిగి కొట్టడం వల్లే చనిపోయాడని స్థానికులు వివరంగా పోలీసులకు తెలియజేశారు.

First published:

Tags: Crime news, Peddapalli, Wife kill husband

ఉత్తమ కథలు