KARIMNAGAR WIFE AND SON BRUTALLY MURDERED BY A MAN IN KARIMNAGAR DISTRICT SNR KNR
Karimnagar : ఆమెకు భర్త, అతనికి తండ్రి .. కాని వాళ్లిద్దరూ కలిసే అతడ్ని చంపారు..ఎందుకంటే
(దారుణ హత్య)
OMG: ఇంటి పెద్దను కుటుంబ సభ్యులే హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. అత్యంత దారుణంగా శత్రువును హతమార్చినట్లుగా ఓ పథకం ప్రకారం బండరాళ్లతో తల, శరీరంపై మోది చంపేశారు. ఈహత్య కేసులో నిందితులు మృతుని భార్య, కొడుకేనని పోలీసు తేల్చారు.
(P.Srinivas,New18,Karimnagar)
తండ్రి ఎంతటి కఠినాత్ముడైనా ఏ కొడుకుకి చంపాలని అనిపించదు. వేదమంత్రాల సాక్షిగా భార్య మెడలో మూడు ముళ్లు వేసిన భర్తను ఊపిరి తీసేంత ధైర్యం ఏ భార్య చేయదు. కాని కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఇప్పుడు ఆ దారుణ ఘటనే అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. హత్య చేయడానికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా ..పోలీసుల(Police) ప్రాధమిక విచారణలో మాత్రం నమ్మలేని నిజాలే బయటకు వస్తున్నాయి. అసలు కరీంనగర్(Karimnagar)జిల్లాలో ఏం జరిగిందంటే.
కరీంనగర్లో దారుణం..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఏరాడపల్లి గ్రామంలో గురువారం రాత్రి హత్య జరిగింది. నడి వయస్సు కలిగిన వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చడం మండలంలోనే సంచలనం సృష్టించింది. రంగు సంపత్ అనే వ్యక్తిని అతని భార్య రమ, కొడుకు వంశీ ఇద్దరూ కలిసి అత్యంత క్రూరంగా బండరాళ్లతో కొట్టి చంపారు. నడి రోడ్డుపై సంపత్‌ని అటకాయించిన భార్య, కొడుకు అతనిపై కసి తీరా బండరాళ్లతో మోది చంపారు. స్థానికుల ద్వారా హత్య జరిగినట్లు తెలుసుకున్న స్థానిక ఎస్సై దేశ్ చంద్రశేఖర్ పోలీస్ సిబ్బందితో పాటు స్పాట్‌కి చేరుకున్నారు. అప్పటికే రంగు సంపత్ ప్రాణాలు విడిచి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. గ్రామస్తులను హత్యకు సంబంధించిన వివరాలను సేకరించారు.
ఇంటి పెద్దను హతమార్చారు..
హత్యకు కారణాలు, ఎందుకు చేశారు, ఎవరు చేశారనే విషయాలపై పోలీసులు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో మృతుడ్ని చంపడానికి ఉపయోగించి బండరాళ్లను పరిశీలించారు. వాటిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. అయితే హత్యకు గురైన సంపత్ మద్యానికి బానిసయ్యాడని..తరచూ కుటుంబ సభ్యులైన భార్య, కొడుకుతో గొడవపడుతూ ఉండేవాడని..వాళ్లను కొట్టేవాడనే సమాచారం ఉంది.
హంతకులు వాళ్లిద్దరే ..
సంపత్ హత్యకు గురైన రోజు అనగా గురువారం రాత్రి కూడా ఇదే విషయంలో తాగొచ్చి భార్య, కొడుకుతో గొడవపడంతో వాళ్లు సహనం కోల్పోయి హత్య చేశారనట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు సేకరించిన ప్రాధమిక సమాచారం ప్రకారం భార్య భర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు ఉన్నట్లుగా తేలింది. స్థానికులు కూడా అలాంటి సమాచారమే ఇవ్వడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకొని విచారిస్తున్నారు. కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈకేసును అన్నీ కోణాల నుండి వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తామని మృతుడు రంగు సంపత్‌ని చంపడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని త్వరలోనే కనుగొని తెలియజేస్తామని స్థానిక ఎస్ఐ దేశ్ చంద్రశేఖర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.