హోమ్ /వార్తలు /తెలంగాణ /

దళితులను కించపరుస్తూ అసభ్యకర చాటింగ్..! ఇది ఈటెల బావమరిది చేసినట్లుగా వైరల్..! ఖండించిన బీజేపీ.. ఇందులో నిజమెంత..

దళితులను కించపరుస్తూ అసభ్యకర చాటింగ్..! ఇది ఈటెల బావమరిది చేసినట్లుగా వైరల్..! ఖండించిన బీజేపీ.. ఇందులో నిజమెంత..

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

Huzurabad: నిన్నటి నుండి ఈటెల రాజేందర్ బామ్మరిది మధుసూదన్ రెడ్డి వాట్సప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హుజురాబాద్ దళితులను కించపరిచరే విధంగా పౌల్టి ఫామ్స్ పార్టనర్ తో చేసిన వాట్సప్ చాట్ ఇప్పుడు అందరిని ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18  తెలుగు) 

నిన్నటి నుండి ఈటెల రాజేందర్ బామ్మరిది మధుసూదన్ రెడ్డి వాట్సప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హుజురాబాద్ దళితులను కించపరిచరే విధంగా పౌల్టి ఫామ్స్ పార్టనర్ తో చేసిన వాట్సప్ చాట్ ఇప్పుడు అందరిని ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దళితులను అత్యంత దారుణమైన పదజాలంతో దూషించాడని.. దళితులను నమ్మలేమని తిడుతూ మధుసుధన్ రెడ్డి మెసేజ్ చేసినట్లు వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  నిన్న ఈటల రాజేందర్ గారి పేరుతో ఫెక్ లెటర్ హెడ్ సృష్టించారు టీఆరెస్ నాయకులు, ఈరోజు ఈటల బావమరిది, శ్రీమతి ఈటల జమున గారి సోదరుడి ఫోన్ నెంబర్ ను ఎడిటింగ్ లో చేర్చి ఫెక్ వాట్సాప్ చాటింగ్ క్రియేట్ చేసి దళితులను తిట్టినట్టు, డబ్బులు పంచుతున్నట్టు మార్పింగ్ చేసి పైశాచిక ఆనందాన్ని పోతున్న టిఆర్ఎస్ ఐటీ విభాగానికి హెచ్చరిస్తున్నాం.. అని బిజెపి నాయకులు అన్నారు.

మీరు ఇలాంటి వాటితో రెచ్చగొడితే రేపటి నుండి కేసీఆర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని బయటికి లాగి బజారులో నిలబెట్టాల్సి వస్తుందని, తర్వాత జరిగే పరిణామాలకు బిజెపి పార్టీ బాధ్యత వహించదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. హుజురాబాద్ ప్రజల ముందుకెళ్లి ఓట్లు అడిగే మొఖం లేక ఇలాంటి చిల్లర మల్లర ఫెక్ పోస్టింగ్స్ తయారు చేస్తున్నాదని మండిపడ్డారు. కేసీఆర్ కు నిజంగా రోశం, పౌరుషం ఉంటే ఎన్నికల రణక్షేత్రంలో దిగి ఈటల రాజేందర్ ను ఎదుర్కోవాలి.. అంతే గానీ లేని పోనీ అభాండాలు వేయడం సరికాదన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అడుగు పెట్టే దమ్ము లేక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పదిమంది చిల్లరగాళ్ళను కూర్చోబెట్టి జరగనిది జరిగినట్టు, చెప్పనిది చెప్పినట్టు ఫెక్ పోస్టింగ్స్ సృష్టిస్తూ బతుకుతున్నారు. మీరెన్ని వెధవ వేషాలు వేసిన హుజురాబాద్ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరంటూ.. టీఆరెస్ పార్టీ నాయకులకు, బీజేపీ వర్గం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.


ఈ విషయం ఇలా ఉంటే ఈరోజు ఉదయం హుజురాబాద్ పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద దళితులను కించపరిచే విధంగా  మధుసూదన్ రెడ్డి మాట్లాడారని.. అతడి దిష్టిబొమ్మను శవంగా చేసి శవయాత్రను దళిత సంఘం ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అతడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈటెల దళిత ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ.. ఈటల రాజేందర్ కుటుంబం పైన కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆ చాటింగ్ మాత్రం హుజురాబాద్ నియోజక వర్గంలో హల్ చల్ చేస్తోంది. అయితే దీనిలో ఎంత వరకు నిజం ఉంది.. ఎంత వరకు అబద్దం ఉందో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మద్దో అర్థం అవ్వడం లేదంటూ  గుసగుసలు నియోజకవర్గంలో వినపడుతున్నాయి.

First published:

Tags: CM KCR, Etela rajender, Huzurabad By-election 2021

ఉత్తమ కథలు