హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad By Elections: మొరాయించిన ఈవీఎంలు.. మొదలైన గొడవ.. తొలిగంటలో ఓటింగ్ శాతం ఎంతంటే..

Huzurabad By Elections: మొరాయించిన ఈవీఎంలు.. మొదలైన గొడవ.. తొలిగంటలో ఓటింగ్ శాతం ఎంతంటే..

క్యూలైన్ లో నిల్చున్న ఓటర్లు

క్యూలైన్ లో నిల్చున్న ఓటర్లు

Huzurabad By Elections: ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఉప ఎన్నిక సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. అయితే ఎన్నికలు జరిగే తీరును ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్ ను కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. ఇదిలా ఉండగా.. హుజురాబాద్ లోని ఇల్లందకుంట శ్రీరాములపల్లిలో గొడవ జరిగింది.

ఇంకా చదవండి ...

(P.Srinivas,News18,Karimnagar)

ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఉప ఎన్నిక సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. అయితే ఎన్నికలు జరిగే తీరును ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్లో కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. ఇదిలా ఉండగా.. హుజురాబాద్ లోని ఇల్లందకుంట శ్రీరాములపల్లిలో గొడవ జరిగింది. ఇల్లందుకుంటలోని పోలింగ్ కేంద్రం 224 బూత్ లో ఈవీఎం మెరాయింపుతో పోలింగ్ ఆలస్యం అవుతుంది. అయితే ఈ విషయంపై లైన్లో ఉన్న కొంతమంది ఓటర్లు వెనుదిరగడంతో అక్కడ గొడవ జరిగింది. సాంకేతిక లోపం ఏర్పడటంతో గంట పాటు ఓటర్లు క్యూ లైన్లో నిలబడి వెనుదిరిగారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, వీణవంక, కమలాపూర్‌, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్‌ జరగుతుంది. తొలి గంటలో హుజూరాబాద్ 7.5 శాతం ఓటింగ్ శాతం నమోదైందని అధకారులు వెల్లడించారు.

Huzurabad: మొదలైన మినీ సంగ్రామం.. భారీగా పోలింగ్ నమోదవుతుందని అధికారుల అంచనా.. అతడివైపే మొగ్గుచూపుతున్న..


ఈ పోలిగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ తో అనుసంధానం చేశారు. ఓటర్లకు మాస్క్ ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 లోక్ సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో హుజురాబద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ లో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక హుజురాబాద్ లో పోలింగు ప్రశాంతంగా .. పకడ్బందీగా నిర్వహిం చేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 2,37,022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు . సంబంధించి 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లేం దుకు వీల్ చైర్లను , కోవిడ్ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు .

Huzurabad By Elections: హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ సారి ప్రత్యేకంగా నిలవనుంది.. ఎందుకుంటే..


పోలింగ్ జరిగే హుజూరాబాద్ నియోజకవర్గంలో నేడు 144 సెక్షన్ అమలులో ఉంటుంది . ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను ఉప యోగిస్తున్నారు . మొత్తం బందోబస్తు సిబ్బంది 3,865 మంది కాగా , ఎన్నికల సిబ్బంది 1715 విధుల్లో పాల్గొననున్నా రు. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా ప్రధాన పోటీ తాజా మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ , టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ , కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావుల మధ్య కొనసాగనుంది . మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నాయి. అయితే ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు.

గ్యాస్ సిలిండర్ కు దండాలు..

హుజూరాబాద్‌లో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్‌ కేంద్రాలకు తరలుతున్నారు. కొందరు మహిళలు గ్యాస్‌ సిలిండర్‌కు దండం పెట్టుకుని ఓటేయడానికి వెళ్తున్నారు. గత కొన్నిరోజులుగా పెట్రోల్‌, డీజిల్‌తోపాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. తర్వలోనే సిండర్‌ బండ ధర రూ.వెయ్యికి చేరనున్నాయనే వార్తలు వస్తున్నాయి. తరచూ పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని.. ఓటు ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి గుణపాఠం చెబుతామన్నారు. బిజెపి ప్రభుత్వం సిలిండర్ పై 538 రూపాయలు పెంచడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలుపుతామంటున్నారు.

First published:

Tags: Huzurabad By-election 2021

ఉత్తమ కథలు