హోమ్ /వార్తలు /తెలంగాణ /

Vemulawada: రాజన్న సన్నిధిలో పాక్షిక లాక్‌డౌన్.. నిబంధనలు పాటించకుంటే జరిమానా.. ఎప్పటివరకంటే..?.. పూర్తి వివరాలు..

Vemulawada: రాజన్న సన్నిధిలో పాక్షిక లాక్‌డౌన్.. నిబంధనలు పాటించకుంటే జరిమానా.. ఎప్పటివరకంటే..?.. పూర్తి వివరాలు..

వేములవాడ ఆలయం

వేములవాడ ఆలయం

కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో.. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతుంది.

  దేశంలో కరోనా సేకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణలో కూడా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కట్టడి కోసం తెలంగాణలోని కొన్ని గ్రామాలు, కాలనీలు ఇప్పటికే స్వచ్చందంగా లాక్‌డౌన్ విధించుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం(ఏప్రిల్ 22) నుంచి మే 1 వరకు పాక్షికంగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్పర్సన్ రామతీర్థం మాధవి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వర్తక వ్యాపారులు, చిరు వ్యాపారులతో బుధవారం పాలకవర్గం సమావేశం అయింది. ఈ సమావేశం లో పలువురు ఇచ్చిన సూచనల మేర పాలక వర్గం పాక్షికంగా లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.

  ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని సూచించారు. కరోనా ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. పాక్షిక లాక్‌డౌన్‌లో ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 5 గంటల నుంచి లాక్ డౌన్ అమలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలలోపు అన్ని దుకాణాలు బంద్ చేయాలని సూచించారు. మెడికల్, ఆసుపత్రులకు మినహాయింపు ఇచ్చారు.


  నేటి నుంచి మే 1 వరకు 10 రోజుల పాటు పాక్షిక లాక్ డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి,కమిషనర్ శ్యామ్ సుందర్ రావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 వేల నుండి 5 వేల వరకు జరిమానా విధిస్తామన్నారు. ప్రజల రక్షణార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలక వర్గం వెల్లడించింది. ప్రజలు,వర్తక, వాణిజ్య వ్యాపారులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

  ఇక, తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 5,567 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,73,468కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న 1,02,335 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 23 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,251 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 49,781కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 989 కేసులు నమోదయ్యాయి.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Coronavirus, Covid-19, Lockdown, Telangana, Vemulawada

  ఉత్తమ కథలు