హోమ్ /వార్తలు /తెలంగాణ /

Viral Video: అతడి ప్లాన్ మామూలుగా లేదుగా.. వరద నీటిలో కారు కొట్టుకుపోకుండా ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్..

Viral Video: అతడి ప్లాన్ మామూలుగా లేదుగా.. వరద నీటిలో కారు కొట్టుకుపోకుండా ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్..

కారును తాళ్లతో కట్టిన యువకుడు

కారును తాళ్లతో కట్టిన యువకుడు

Viral Video: సిరిసిల్ల పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలు ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. అయితే తన కారు వరద నీటిలో కొట్టుకుపోకుండా వినూత్నంగా ఆలోచించాడు ఒక వ్యక్తి. ఇంతకు అతడు ఏం చేశాడంటే..

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా సదుపాయాలు నిల్చిపోయాయి. వరదలకు భారీగా పంటనష్టం వాటిల్లింది. ఉత్తర తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో సిరిసిల్ల పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలు ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. అయితే తన కారు వరద నీటిలో కొట్టుకుపోకుండా వినూత్నంగా ఆలోచించాడు ఒక వ్యక్తి. తన ఇంటిపై ఉన్న పిల్లర్లకు తాళ్లు కట్టి, కారును వేలాడదీశాడు. దీంతో వరద నీరు రోడ్లపై భారీగా ప్రవహిస్తున్నా, అతడి కారు నీటిలో కొట్టుకుపోలేదు. ఇరుగుపొరుగువారు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.

వీడియోలో ఏముంది?

కారు వరద ప్రవాహంలో కొట్టుకుపోకుండా, దాన్ని భారీ తాళ్లతో కట్టి, పిల్లర్లకు వేలాడదీసినట్లు వీడియోలో కనిపిస్తోంది. యజమాని ఇంటి పైన కాంక్రీట్ స్తంభాలకు ఈ తాళ్లను బిగించారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి.. ‘రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శాంతినగర్ వద్ద ఒక కారును యజమాని ఇలా తాళ్లతో వేలాడదీశాడు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరదలో కారు కొట్టుకుపోకుండా యజమాని ఈ ఏర్పాట్లు చేశాడు’ అని క్యాప్షన్ రాశారు.

Monkeys: గోదావరి నది బ్రిడ్జిపై.. ఇటు రైతులు.. అటు రైతులు.. మధ్యలో కోతులు.. గత్యంతరం లేక వానరాలు ఎం చేశాయంటే.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు కారు యజమానిని మేధావిగా పేర్కొన్నారు. ‘తాళ్లతో కారును రక్షించుకోవడం మంచి ఆలోచన’ అని ఒక యూజర్ కామెంట్ రాశాడు. భవిష్యత్తులో ప్రజలు తమ వాహనాలను టెర్రస్‌పై పార్క్ చేసుకోవాల్సి వస్తుందేమో అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. ‘థింక్ డిఫరెంట్’ అంటూ మరో యూజర్ ఈ వీడియోకు ఒక మీమ్‌ జత చేశాడు. అని రాశారు.

Innovative Protest: బురద నీటిలో చేపలు పడుతూ.. పొర్లు దండాలు పెట్టారు.. ఎందుకంటే..


గతంలో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తినప్పుడు ఎన్నో కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. గత కొన్ని వారాలుగా భారీగా వర్షాలు పడుతుండటంతో కారు యజమాని పరిస్థితిని ముందే ఊహించాడు. తన వాహనం వరద నీటిలో కొట్టుకుపోకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసుకొని, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి.

నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. భారీ వర్షపాతం కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు తీవ్రంగా నష్టపోయారు. సిరిసిల్ల పట్టణంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 216 కుటుంబాలను అధికారులు సహాయ శిబిరాలకు తరలించారు.

Published by:Veera Babu
First published:

Tags: Sircilla, Telangana, Viral Video

ఉత్తమ కథలు