(P.Srinivas, News18, Karimnagar)
హుజురాబాద్(Huzurabad) ఉప ఎన్నికల(By Election) నేపథ్యంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ వినాయక మండపంలో దేవుడు చుట్టూ గణేష్(Ganesh) ప్రదక్షిణలు.. అంటూ పార్టీ అభ్యర్థులు ఈటెల(Etala), గెల్లు, కొండా సురేఖ(Konda Surekha) ఫోటోలు ప్రదక్షణలు చేస్తున్నట్లు తయారు చేసి పెట్టారు. కరెంట్ తో తయారు చేసిన ఈ ఫోటోలు నిరంతరం దేవుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దర్శనమిస్తూ కనిపించింది ఈ వీడియో. ఇప్పుడు ఈ వీడియో హుజురాబాద్ లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీ నాయకుల అభ్యర్థులు వారి ప్రచారం మమ్మురం చేశారు. ఎవరికీ వారే తమదైనా శైలిలో ప్రచారం లో దూసుకుపోతున్నారు.
పార్టీ మీటింగ్ లు సభలు, సమావేశాలు, పెట్టి ఇంటింట వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఎవరికి నచ్చిన రీతిలో వారు వెరైటీగా ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హుజురాబాద్ లో కొంతమంది కమ్మ్యూనిటీ సభ్యులు కలిసి వినాయకుని పెట్టుకున్నారు. అందరిలా కాకుండా వెరైటీ గా ఉండాలనుకున్నారో ఏమో కాని హుజురాబాద్ లో ప్రస్తుతం నడిచే పరిస్థితిని బట్టి వాళ్ళు ఇలా కొత్తగా ఆలోచించి గణేష్ చుట్టూ నాయకులు ప్రదక్షణ అనే బ్యానర్ పెట్టి.. పార్టీ అభ్యర్థులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి దేవుడి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నట్లు కరెంట్ తో తయారు చేసి ఇలా అభిమానాన్ని చాటుకున్నారు.
ఇది చుసిన అందరు ఈ వీడియో ను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ఈవిషయం కాస్త వైరల్ గా మారింది. మంత్రి ఈటెల రాజీనామాతో హుజూరాబాద్ ఎన్నికలలో బై ఎలక్షన్ జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణా రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ప్రస్తుత రాజకీయాలు ప్రతిబింభించే విధంగా అచ్చంపేట వాసులు వినూత్న గణపతిని ప్రతిష్టించారు. గెలుపు కోసం రాజకీయ పార్టీల నాయకులు గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు రూపొందించారు. ప్రస్తుతం ఈ గణపతి ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.
హుజురాబాద్ కు చెందిన రాజకీయ నాయకుల బొమ్మలు గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు రూపొందించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించేలా వినాయకుడు ఆశీర్వదించాలన్నట్లు విఘ్నేశ్వరుడి చుట్టూ తిరుగుతున్న అభ్యర్ధుల బొమ్మలు అందరిని ఆకర్షిస్తున్నాయి. వీటి మాదిరిగానే నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఇంద్రా నగర్ కాలనిలో వినాయక చవితి సంధర్భంగా వినూత్న రీతిలో మండపాన్ని అలంకరించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా వినూత్న గణపతిని ప్రతిష్టించారు ఇంద్రానగర్ కాలనీ వాసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.