హోమ్ /వార్తలు /తెలంగాణ /

Viral video : ఊరికి దెయ్యం పట్టిందని మాంత్రికుడితో పూజలు.. ఒక్కో ఇంటి నుండి డబ్బు వసూలు

Viral video : ఊరికి దెయ్యం పట్టిందని మాంత్రికుడితో పూజలు.. ఒక్కో ఇంటి నుండి డబ్బు వసూలు

TANTRIK PUJA

TANTRIK PUJA

OMG: సాంకేతిక పరిజ్ఞానం రాకెట్ల దూసుకుపోతున్న ఈ కాలంలోమూఢ నమ్మకాల పేరుతో కొంతమంది దొంగ బాబాలు అందిన కాడికి దోచుకుంటున్నారు. విషజ్వరాలతో గ్రామస్తులు మరణిస్తే దాన్ని అడ్డుపెట్టుకొని కొందరు కేటుగాళ్లు ఏం చేశారో తెలుసా.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

సాంకేతిక పరిజ్ఞానం రాకెట్ల దూసుకుపోతున్న ఈ కాలంలోమూఢ నమ్మకాల పేరుతో కొంతమంది దొంగ బాబాలు అందిన కాడికి దోచుకుంటున్నారు. జగిత్యాల(Jagtial)జిల్లా రాయికల్ (Raikal) మండలం రామోజీపేట (Ramojipet)గ్రామంలో గత కొద్ది రోజులుగా విషజ్వరాల (Poisonous fevers)బారినపడి గ్రామస్తులు మరణిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు గ్రామస్తులు గ్రామానికి కీడు సోకిందని ...దెయ్యం పట్టి పీడిస్తోందని దాన్ని వదిలించడానికి మాంత్రికుడితో పూజలు చేయిస్తే ఫలితం ఉంటుందని నమ్మించారు.

TS Congress : తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన హస్తం నేతలు .. కారణం అదేనంట

కీడు పేరుతో మోసం ..

రామోజీపేట గ్రామస్తుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు తెలివిగా కీడు పోవడానికి ...దెయ్యాన్ని వదిలించడానికి సుమారు 10లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆరు లక్షలకు బేరం కురుర్చుకున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి 500 రూపాయలు ఇవ్వాలని ఆదేశాలు జారి చేశారు. గ్రామం నడిబొడ్డున హనుమాన్ ఆలయం ముందు పూజలు చేయించారు. గ్రామానికి చెందిన వారు ఎవ్వరూ కూడా బయట నిద్రించవద్దని సాయంత్రంలోపు ఊరుకి చేరుకోవాలని ప్రకటించారు.

గ్రామంలో తాంత్రిక పూజలు..

గ్రామంలోని ప్రతి కుల సంఘాలు వారికి ఈ ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ ఆలయం ముందు ముగ్గులు పోసి పెద్ద ఎత్తున్న డప్పు చప్పుళ్ళతో పూజలు చేసి కోళ్ళని, మేకలని బలి ఇచ్చారు. బలి ఇచ్చిన కోళ్లని గ్రామంలోని కమాన్‌కి కట్టి వేలాడదీశారు. మూఢనమ్మకంతో మూడో కంటికి తెలియకుండా ఈ తాంత్రిక పూజ నిర్వహించారు. అయితే గ్రామస్తుల ద్వారానే ఈ గుట్టు వీడటంతో అసలు కథ బయటపడింది. మంత్రికుడు పూజలు చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామానికి చెందిన కొందరు మూఢ నమ్మకాల పేరుతో గ్రామస్థుల నుండి డబ్బులు దోచుకున్నాడని కొందరు పథకం ప్రకారమే డబ్బులు గుంజడానికి ఇలాంటి పనులు చేశారని గ్రామస్తులు అంటున్నారు.

NIA RIDES : తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు .. ఆ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలే టార్గెట్‌గా సీక్రెట్ ఆపరేషన్

డబ్బు దోచుకునేందుకే ఎత్తుగడ..

జగిత్యాల జిల్లా జరిగిన సంఘటన తరహాలోనే మూడ్రోజుల క్రితం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామాయపల్లిలో జరిగింది. ఊరికి కీడు సోకిందని ఊరు ఊరంతా ఖాళీ చేసి ఊరు బయట వంటలు చేసుకుని అక్కడే తిని ఉండాలని ఓ పూజారి చెప్పిన మాటలు విని ఊరు ఊరంతా ఖాళీ చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ అంశం తెరపైకి రావడంతో పోలీసులు గ్రామస్తుల్ని హెచ్చరిస్తున్నారు. మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహించినప్పటికి ప్రజల్లో చైతన్యం రావడంలేదంటున్నారు. మూఢనమ్మకాల పేరుతో ప్రజలు మోసం చేసే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు.

First published:

Tags: Jagityal, Telangana News, Viral Video

ఉత్తమ కథలు