కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేసింది. మరోసారి అలా జరగకూడదనే ముందు జాగ్రత్తగా కొన్ని గ్రామాల్లో లాక్ డౌన్ ను స్వచ్ఛందంగా విధించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ భయం ప్రజలను అతలాకుతం చేస్తుంది. ఇప్పటికే మొదటి వేవ్ లో చాలామంది కరోనా బారిన పడి కోలుకొని హమ్మయ్య అనుకున్నారు. కాని ఇప్పుడు సెకండ్ వెవ్ రూపంలో మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 4లక్షల 50వేల వరకు కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 26,707 మంది కరోనా బారిన పడ్డారు. 306 మంది వరకు మృతి చెందారు. ప్రస్తుతం ఆక్టివ్ కేసులు 500 లకు పైగా ఉండగా వీరిలో ఎక్కువ శాతం ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. గడిచిన వారం రోజులలో జిల్లాలో పలు ప్రాంతాల్లో 10 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా బారిన పడిన వారిని గుర్తించేదుకు అధికారులు టెస్ట్ ల సంఖ్య పెంచారు. మరో పక్క వాక్సినేషన్ కార్యక్రమం చురుకుగా కొనసాగుతుంది. బుధవారం జిల్లాలోని 34 కేంద్రాలలో 5,217 మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. కేసులు ఎక్కువ కావడంతో గతంలో లాగా గ్రామాలు స్వచ్చందంగా లాక్ డౌన్ ప్రకటించుకుంటున్నారు. ఇందులోనే భాగంగా నిన్న చొప్పదండి మండలం పెద్దకుర్మ పల్లి గ్రామంలో 53 మందికి కరోనా పాజిటివ్ రావడంతో గ్రామ సర్పంచ్ గంగ మల్లయ్య గ్రామంలో లాక్ డౌన్ ప్రకటించారు.
ఎవరు ఊరులోకి రావద్దని.. ఊరులో వాళ్ళుకూడా 15రోజుల పాటు ఎవరు బయటకు వెళ్ళకుండా స్వీయ లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావద్దని సర్పంచ్ తెలిపారు. కరోనా నిబంధనలు ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా పాటించాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Corona Possitive, Covid vaccine, Karimnagar, Lock down, Lock down impossed, Telangana