(P.Srinivas,New18,Karimnagar)
సైన్స్ రాకెట్ లా దూసుకుపోతున్న ఇకాలంలో కూడా మూఢనమ్మకాలు లపై ప్రజలకు ఏ మాత్రం విశ్వాసం తగ్గడం లేదు. కరీంనగర్(Karimnagar)జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ (Arnaconda)గ్రామపంచాయితీ కొన్ని రోజుల క్రితం ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఓ ఉడుము(Skunk)నెమ్మదిగా పంచాయతీ కార్యాలయంలోకి అందులోని సర్పంచ్ కూర్చునే గదిలోకి వచ్చి వెల్లిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న సర్పంచ్ విద్యాసాగర్ రెడ్డి (Vidyasagar Reddy)అప్పటి నుండి తనకు కేటాయించిన ఆఫీసు గదిలోకి వెల్లడమే మానుకున్నారు. అప్పటి నుండి ఆఫీసు కార్యకలాపాలు చక్కబెట్టేందుకు పంచాయితీ భవనంలోకి వస్తున్న సర్పంచ్ కార్యదర్శి పక్కనే మరో కూర్చి వేసుకుని వ్యవహారాలు పర్యవేక్షించి వెల్లిపోతున్నారు.
మూఢనమ్మకాల ప్రభావం..
ఉడుము చొరబడ్డ కారణంతో పంచాయితీ సిబ్బంది కొంతమంది విధులకు రావడం లేదని, అప్పటి నుండి తాము అనారోగ్యానికి గురవుతున్నామని వారు చెబుతున్నారు. దీంతో ఆర్నకొండ పంచాయితీ యంత్రాంగాన్ని ఉడుము భయం వెంటాడుతోందని స్ఫష్టమవుతోంది. దీంతో గ్రామంలో దసరా ఉత్సవాలు కూడా నిర్వహించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా విజయదశమి పర్వ దినాన జమ్మి ఇస్తూ అలాయ్ బలాయ్ తీసుకుని వేడుకలు నిర్వహించుకునే ఆనవాయితీకి కూడా స్వస్తి పలికారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తరాలుగా వస్తున్న ఆనవాయితీకి ఒక్క ఉడుము ఎంట్రీతో బ్రేకులు వేయడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
భయం కాదు ఉడుము దోషం..
ఉడుము దోషం పోవాలంటే కొన్ని తాంత్రిక పూజలు చేసుకుంటే దోషం పోతాయని పూజారులు అంటున్నారు. ఇక ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడం విశేషం. అయితే చాల సంవత్సరాల నుండి మనం ఇలాంటి సంఘటనలు ఎన్నో గ్రామాల్లో ఎక్కువగా చూస్తూనే వస్తున్నాం. ఇంట్లోకి ఉడుము చొరబడింది అంటే ఆ ఇల్లు ఖాళీ చేసి కొద్ది రోజులు వేరే ఇంట్లో ఉండడం లేదా శాంతి పూజలు చేసుకునేవారు. ఇది కాస్త ఇప్పుడు పట్టణాలలో కూడా వ్యాపించడం పట్టణ ప్రజలు కూడా వీటిని నమ్మడంతో జిల్లా అంతటా వింతగా చర్చించుకుంటున్నారు.
ఇంకెప్పుడు మారేది ..
గ్రామపంచాయితీ కార్యాలయంలోకి ఉడుము వచ్చిందని పరిపాలన వ్యవహారాలు వదిలేయడం కరెక్ట్ కాదని మేధావులు, విద్యావంతులు సూచిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల సహాయంతో దాన్ని బయటకు రప్పించి యధావిధిగా కార్యక్రమాలు కొనసాగించాలని .. మూఢనమ్మకాలు, పురాతన సామెతలను పట్టుకొని గ్రామాభివృద్ధికి బ్రేక్లు వేయవద్దని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Telangana News, VIRAL NEWS