నిజామాబాద్(Nizamabad)ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind)జగిత్యాల(Jagityala)జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలకు వెళ్లారు. బీజేపీ ఎంపీ(Bjp mp)రాకను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్‌తో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. నియోజకవర్గ పరిధిలో ఓ ఎంపీపై దాడి చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా తప్పు పట్టింది. ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్(TRS) శ్రేణులు పథకం ప్రకారం చేసిన దాడిగా బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah)స్వయంగా ఎంపీకి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అర్వింద్‌పై దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు.
ప్లాన్ ప్రకారమే దాడులు..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కాన్వాయ్‌పై దాడిని భారతీయ జనతా పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఎంపీ ఆర్వింద్ కాన్వాయ్‌పై దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఖండించారు. విషయం తెలిసిన వెంటనే తానే స్వయంగా తానే బీజేపీ ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలోని వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లారు అర్వింద్. గ్రామంలోని రావద్దంటూ స్థానికులు ఆయన కారును అడ్డుకున్నారు. ఎంపీ కారుతో పాటు మరో వాహనంపై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం ప్లాన్ ప్రకారమే తనపై దాడులు జరుగుతున్నాయని..బీజేపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకొని టీఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నట్లుగా వెల్లడించినట్లుగా అర్వింద్ తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అర్వింద్ ఎక్కడ తిరిగినా దాడులు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిందని అర్వింద్ కేంద్రమంత్రితో చెప్పారు. అంతే కాదు శుక్రవారం తనపై జగిత్యాల జిల్లాలో జరిగిన దాడి వెనుక ఎమ్మెల్యే విద్యాసాగర్ అన్నారనే విషయాన్ని కూడా అర్వింద్ కేందమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.
రోజురోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతతో, అసహనానికి గురవుతున్న అరాచకపు కుటుంబ నాయకత్వం మరియు వారి శ్రేణులు బిజెపి పార్లమెంట్ సభ్యులు శ్రీ @Arvindharmapuri గారి పై పథకం ప్రకారం దాడులకు దిగడం చాలా హేయమైన చర్య. దీన్ని ప్రజాస్వామిక వాదులు గమనించాలి. pic.twitter.com/pE0ugjL047
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 15, 2022
పిరికి పందల చర్య..
నిజామాబాద్ ఎంపీ కాన్వాయ్‌పై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నియంతృత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకే బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడి పిరికి పందల చర్యగా అభివర్ణించారు బండి సంజయ్. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు అసహ్యించుకుంటున్నా.. వారిలో మార్పు రాకపోవడం దారుణమని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
తిప్పి కొడతామంటున్న బీజేపీ..
టీఆర్ఎస్ పాల్పడుతున్న ఇలాంటి దాడులకు తాము వెనుకాడే ప్రసక్తి లేదని పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు బండి సంజయ్. గోదావరి ముంపు బాధితులకు ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చిందని.. కానీ ఆ భూములను స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువులకు ఇప్పించుకున్నారని అర్వింద్ ఆరోపించారు. ఈ తప్పును ఎత్తిచూపుతానన్న భయంతోనే ఆయనపై దాడికి పాల్పడ్డారని బండి సంజయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bandi sanjay, Dharmapuri Arvind, Telangana Politics