Home /News /telangana /

KARIMNAGAR UNIDENTIFIED PERSONS AT THE BACK WALL OF THE SCHOOL TAKING PHOTOS AND VIDEOS OF THE STUDENTS TAKING A BATH KNR VB

Womens Hostel: బాలికల హాస్టల్ లో గుర్తు తెలియని వ్యక్తులు.. స్నానాలు చేస్తుండగా.. నగ్న ఫొటోలు, వీడియోలు తీస్తూ..

Womens Hostel: రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా.. ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి . పోకిరీల బెడదతో ఎంతోమంది విద్యార్థినీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . తాజాగా .. అలాంటే సంఘటనే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్ లోని గురుకుల బాలికల హాస్టల్లో చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,News18,Karimnagar)

    రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా.. ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి . పోకిరీల బెడదతో ఎంతోమంది విద్యార్థినీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . తాజాగా .. అలాంటే సంఘటనే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్ లోని గురుకుల బాలికల హాస్టల్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వెనుకబడిన తరగతుల బాలికల పాఠశాలలో 5 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే గతకొన్ని నెలలుగా పాఠశాల వెనుక భాగంలోని గోడ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థినీలు స్నానాలు చేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని తల్లిదండ్రులతో పాటు పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు విమలకు కూడా విద్యార్థినులు తెలియజేశారు .

    MLC Koushik Reddy: హుజురాబాదులో తగ్గని రాజకీయ వేడి.. ఈటెల మీద కోపంతో కౌశిక్ రెడ్డి కి పదవుల పంట..?


    ఈ విషయాన్ని పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు . రక్షణ లేదంటూ తమ పిల్లలని ఇంటికి తీసుకెళ్ళారు . అయితే దీనిపై తమకు ఇంతకు ముందు ఎటువంటి సమాచారం లేదని పాఠశాల యాజమాన్యం చెప్పడం గమనార్హం . పాఠశాలలో సుమారుగా 400లకు పైగా విద్యార్థినులు ఉన్నారు. అయితే.. వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఇదివరకే మీడియాకు సైతం తెలియజేశారు .

    Certificates: బీటెక్, డిగ్రీ, ఇంటర్ సర్టిఫికెట్ ఏదైనా ఇక్కడ దొరుకుతుంది..! కేవలం రూ.50 వేలకే.. చివరకు ఏమైందంటే..


    పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు . అయినా , ఎవరూ పట్టించుకోలేదని ఏకంగా విద్యార్థినిల తల్లిదండ్రులే రోడ్లమీదకు వచ్చి నిరసన కార్యక్రమం చేశారు. దీంతో తమ హాస్టల్ వద్ద పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని పోలీసులకు ప్రిన్సిపల్ విమల ఇచ్చిన లేఖను మీడియాకు చూపించారు. సుమారుగా 400 మందికి పైగా విద్యార్థినులు ఉంటోన్న హాస్టల్ లో కొన్ని చోట్ల నిషేధిత వస్తువులు సైతం దర్శనమిచ్చాయి . దీనిపై పాఠశాల యాజమాన్యానికి సూచించగా తమకేం తెలియదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది .

    Wife And Husband: పెళ్లితో ఒక్కటైన  బంధం... చావులో కూడా వీడలేదు.. ఏం జరిగిందంటే..


    అంతేగాకుండా హాస్టల్ లో జరిగిన విషయాలపై ప్రిన్సిపల్ను వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు . కొంతమంది సిబ్బంది సైతం విద్యార్థినులను హాస్టల్లో దూషిస్తున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. గతంలో హాస్టల్ వద్ద పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని , అప్పటి నుండి ప్రతిరోజు మా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని వన్ టౌన్ సీఐ రమేష్ బాబు ఫోన్లో తెలిపారు . ఇంతకుముందు ఈ సంఘటనపై తమకు ఎప్పుడు సమాచారం లేదని , ఆదివారం పాఠశాల నుండి సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బందిని హాస్టల్కి పంపించినట్లు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Karimnagar

    తదుపరి వార్తలు