Home /News /telangana /

KARIMNAGAR TWO BROTHERS DIED WITH HEART ATTACK AT SAME TIME IN JAGITTALA DISTRICT SNR KNR

Telangana:తమ్ముడి మృతితో అన్నకు హార్ట్‌ఎటాక్..రక్తసంబంధాన్ని విడదీయలేకపోయిన మృత్యువు

(మృత్యువులో కూడా కలిసే)

(మృత్యువులో కూడా కలిసే)

Telangana: అన్నీ బంధాల్లోకెల్లా రక్తసంబంధం ఎంతో విలువైనది, బలమైనది. ఎవరూ విడదీయలేనిదని మరోసారి రుజువైంది. జగిత్యాల జిల్లాలో అన్నదమ్ముల అనుబంధాన్ని చివరికి ఆ మృత్యువు కూడా విడదీయలేకపోయింది.

    (P.Srinivas,New18,Karimnagar)
    అన్నీ బంధాల్లోకెల్లా రక్తసంబంధం ఎంతో విలువైనది, బలమైనది. ఎవరూ విడదీయలేనిదని మరోసారి రుజువైంది. జగిత్యాల జిల్లాలో అన్నదమ్ముల అనుబంధాన్ని చివరికి ఆ మృత్యువు కూడా విడదీయలేకపోయింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండల కేంద్రంలోని మహాలక్ష్మివాడకు చెందిన గాజుల సత్తయ్య(Sattayya), సత్తవ్వ(Sattavva)దంపతులకు భాస్కర్ , శ్రీనివాస్ , మంజుల సంతానం. పెద్ద కుమారుడు శ్రీనివాస్(Srinivas)జగిత్యాల(Jagityala)జిల్లా కేంద్రంలో చిన్న హోటల్ నిర్వహించేవాడు. చిన్న కొడుకు భాస్కర్ జగిత్యాల జిల్లా ధర్మపురి(Dharmapuri)లో వ్యాపారం చేస్తున్నాడు. కూతురు మంజులవివాహం చేసిన తర్వాత సత్తయ్య , సత్తవ్వ లక్సెట్టిపేట(Laxettipeta)లోనే ఉంటూ శేషజీవితం గడుపుతున్నారు. జీవితంలో వృద్దాప్య దశలో ఉన్న ఆ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేకపోయారు. ధర్మపురిలో ఉన్న చిన్న కొడుకు భాస్కర్‌కి సోమవారం ఉదయం ఐదు గంటలకు గుండెపోటు(Heart attack)వచ్చిందని శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఫోన్ రావడంతో అందరూ ధర్మపురికి చేరుకున్నారు. హార్ట్‌ ఎటాక్‌ కారణంగా 47సంవత్సరాల భాస్కర్ చనిపోయాడు. అతని మృతదేహాన్ని తల్లిదండ్రులు ఉంటున్న లక్సెట్టిపేటకు తీసుకొచ్చారు. 47ఏళ్లుగా కలిసి, మెలిసి పెరిగిన తన తమ్ముడు విగతజీవిగా కళ్ల ముందు కనిపించడాన్ని తట్టుకోలేకపోయాడు శ్రీనివాస్. తమ్ముడు మృతదేహాన్ని చూస్తూనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి తరలించారు. అయితే అప్పటికే శ్రీనివాస్‌ కూడా చనిపోయాడని డాక్టర్లు(Doctors)నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

    ఒకేసారి అన్నదమ్ములకు గుండెపోటు..
    ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకు నిమిషాల వ్యవధిలోనే చనిపోవడంతో సత్తయ్య, సత్తవ్వతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శ్రీనివాస్‌కు భార్య , ఇంటర్మీడియట్ చదివే ఇద్దరు కుమారులు ఉన్నారు. భాస్కర్‌కు భార్య, కూతురు ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోవడం ఆ దంపతులకు తీరిన దుఃఖాన్ని మిగిల్చింది. అన్నదమ్ములుగా కలిసి పెరిగిన ఇద్దరికి ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించడం స్థానికుల్ని తీవ్రంగా బాధించింది.

    మృత్యువులో కూడా కలిసే..
    వృద్ధాప్యంలో ఉన్న దంపతులకు చెట్టంత ఎదిగిన కొడుకులు శాశ్వతంగా దూరమవడంపై స్థానికులు వాళ్ల బాధను వర్ణించలేకపోయారు. చనిపోయిన భాస్కర్, శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే సంజయకుమార్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపలి దివాకర్‌రావు, కౌన్సిలర్లు పరామర్శించారు. అన్నదమ్ములు ఒకేసారి మరణంతో జగిత్యాల, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్, భాస్కర్ సోదరులు 47సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా కలిసే ఉన్నారని స్థానికులు తెలిపారు. ఎవరికి వాళ్లు వేర్వేరు ఫ్యామిలీలు ఏర్పడినప్పటికి పండుగలు, వేడుకల్లో కలిసి, మెలిసి పాలుపంచుకునేవారని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Heart Attack, Jagityal, Manchirala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు