KARIMNAGAR TWIST IN JAGITYAL MURDER CASE LOCAL PEOPLE SAYS THAT THEY KILLED THEM DUO TO BLACK MAGIC VRY
Telangana : అవును మేమే చంపాము.. జగిత్యాల జంట హత్య కేసులో ట్విస్ట్..
ప్రతీకాత్మకచిత్రం
Telangana : జగిత్యాల జిల్లా టీఆర్ నగర్లో తండ్రితో పాటు ఇద్దరు కుమారుల హత్యలో ట్విస్ట్ నెలకొంది. ఆ ముగ్గురిని తామే హత్య చేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.
జగిత్యాల జిల్లా టీఆర్ నగర్లో నిన్న తండ్రితో పాటు ఇద్దరు కుమారుల మూకుమ్మడి హత్య సంచలనం రేగిన విషయం తెలిసిందే.. అయితే మంత్రాల నెపంతో వారిని హత్య చేసినట్టు ప్రాధమిక అంచనాకు వచ్చిన పోలీసులు ఆ దిశగా.. విచారణ చెపట్టారు. దీంతో షాకింగ్ నిజాలు తెలిసినట్టు సమాచారం. స్థానికంగా ఉండే ప్రజలే వారిని మంత్రాలు చేస్తున్నారనే నెపంతో చంపినట్టు చెబుతున్నారు. గత ఇరవై సంవత్సరాలు స్థానికులను మంత్రాల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి ఇబ్బందులతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆర్ధిక నష్టపోయినట్టు మీడియాకు వివరించారు. ఇక పోలీసులకు చెప్పామని అయిన సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు..
కాగా జగిత్యాల (Jagityal) పట్టణంలోని టి ఆర్ నగర్ కు చెందిన జగన్నాథం నాగేశ్వర్, అతనికి కుమారులు జగన్నాథం రాంబాబు , రాజేష్ , రమేష్. అయితే వీరి కుల సంఘం సమావేశం ఆరు నెలలకు ఒకసారి జరుగుతుంది. ఈ మేరకు గురువారం జరిగిన కుల సంఘ సమావేశానికి నాగేశ్వర్ ముగ్గురు కుమారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యర్థులు వీరిపై పగతో, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలని పక్కా ప్లాన్‌తో మారణాయుధాలతో సమావేశానికి వచ్చారు.
సమావేశం (Meeting) జరుగుతుండగా జరిగిన ఘర్షణలో వనం దుర్గయ్య , వనం గంగయ్యలతో మరికొందరు మారణాయుధాలతో జగన్నాథం నాగేశ్వర్ అతని కుమారులు రాంబాబు , రమేష్ , రాజేష్‌ల పై దాడి చేశారు . ప్రత్యర్దుల దాడి నుంచి రాజేష్ తప్పించుకోగా , జగన్నాథం నాగేశ్వర్ , రాంబాబు రమేష్‌లు ప్రత్యర్థుల దాడిలో మృతి చెందారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.