Home /News /telangana /

KARIMNAGAR TRS REBAL CANDIDATES MAY COME TO ONE STAGE TO GET ONE SEAT VRY

TS MLC : ఒక్క సీటైనా గెలవాలి... కరీంనగర్‌లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధులు ఏకతాటిపైకి .. ?

election-commission

election-commission

TS MLC : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారనున్నాయా.. రెబల్ అభ్యర్థులు అందరు ఏకతాటిపై వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా...

    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి రాజకీయ సమీకరణలు రోజుకో మలుపు తిరుగున్నాయి. అన్ని జిల్లాలకంటే ఈ ఒక్క జిల్లాలోనే అత్యధిక నామినేషన్లు ధాఖాలు అయ్యాయి. దీంతో 24 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. కాగా బరిలో ఉన్నవారిలో ఎక్కువగా టీఆర్ఎస్ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు.( Karimanagar localbody mlc elections ) దీంతో కరీంనగర్‌లో రెండు స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలోనైనా గెలుపొందేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. (trs rebal candidates) ముఖ్యంగా నామినేషన్ వేసిన వారిలో ఎక్కువగా టీఆర్ఎస్ ఎంపీటీసిలే ఉండడంతో పాటు పార్టీలో ఉన్న అసంతృప్తులు ఎక్కువగా ఉన్నారు. ( Karimanagar localbody mlc elections )దీంతో వీరంతా ప్రతిపక్ష పార్టీల సభ్యులను కలుపుకుని నామినేషన్ వారిలో ఓ ఉమ్మడి అభ్యర్థిని పోటిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం.

    ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేసిన సర్ధార్ రవీందర్ సింగ్ అసంతృప్తులను కలిసి వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం.( Karimanagar localbody mlc elections ) అందుకే ఆయన తన రాజీనామాను కూడా సమర్పించారు. ఇందుకోసం రవీందర్ సింగ్ తో పాటు మరికొంత మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. (trs rebal candidates) ఈ క్రమంలోనే నేతల సెల్‌ఫోన్లు సైతం స్విచ్‌ఆఫ్ చేసి రహస్యంగా సమావేశం నిర్వహించినట్టు చెబుతున్నారు.

    Nagarkarnool : ఆ ఇద్దరు భార్యభర్తలు..పోలీసులను.. ఉరుకులు, పరుగులు పెట్టించారు.. కారణం తెలిస్తే... షాకే మరి...


    ముఖ్యంగా ఎంపీటీసీలు అధిక సంఖ్యలో ఉండడంతో తమ డిమాండ్స్ నెరవేర్చుకోవడంలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం తమలో కూడా వ్యతిరేకంగా ఉన్నవారిని జారీపోయకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ( Karimanagar localbody mlc elections )ఇందుకోసం స్వంత పార్టీ నేతల సమావేశంలో తీర్మణం చేసుకుని బరిలోకి దిగిన నేతలు, ప్రతి పక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు కూడా వారితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. (trs rebal candidates) ముఖ్యంగా నేటి సాయంత్రం నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉండడంతో కొంతమంది విత్ డ్రా చేసుకుని ఉమ్మడి అభ్యర్థిపై ఒక క్లారీటిని తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Siddipet : పాము కరిస్తే, పసుపు పెట్టి.. కట్టు కట్టింది. నిద్ర కూడ పొమ్మంది...! కాని ఆ పాప ...మాత్రం..


    ఇక కరీంనగర్ జిల్లా మొత్తం 1324 ఓట్లు ఉన్నాయి. వీరిలో 750కి పైగా ఎంపీటీలే ఉన్నారు. మిగతా వారు మున్సిపల్ కార్పోరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఇతర సభ్యలు ఉన్నారు. (trs rebal candidates) కాగా వీరందరితో స్థానిక మంత్రులు కొప్పుల ఈశ్వర్ తోపాటు గంగుల కమాలాకర్ సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. దీంతో రెబల్ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే పావులు కదుపుతుండడంతో వారి ప్రయత్నాలు ఏమేరుకు ఫలించనున్నాయో అనేది ఉత్కంఠగా మారింది.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimnagar, Mlc elections, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు