హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : కరీంనగర్ ఉద్యమ కోటకు బీటలు.. పెరుగుతున్న అసమ్మతి..

Karimnagar : కరీంనగర్ ఉద్యమ కోటకు బీటలు.. పెరుగుతున్న అసమ్మతి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karimnagar : తెలంగాణ ఉద్యమంలో ముందున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి బీటలు వారుతున్నాయా..? ఇన్నాళ్లు పార్టీ అధినేత చెప్పిందే.. వేదంగా కొనసాగిన టీఆర్ఎస్ ప్రస్థానానికి బ్రేకులు పడనున్నాయా..?

  న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి

  తెలంగాణ ఉద్యమ కాలం నుండి మొదలుకొని తెలంగాణ ( telanagana ) రాష్ట్ర ఏర్పాటు వరకు రాష్ట్ర చరిత్రలో కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది . టిఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ కంచుకోట అని సిఎం కేసిఆర్ ( cm kcr ) ఎన్నో సభ వేదికలపై చెబుతూ ఉండేవారు .ఆయన ఉద్యమ ప్రస్థానం కూడా ఆ జిల్లా కేంద్రం నుండే మొదలైంది. ఆమరణ దీక్షకు అక్కడి నుండే నాంది పలికారు.. దీంతో ఆ జిల్లా టీఆర్ఎస్ కు కంచుకోటగా మారింది. అలాంటి కోటకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల (mlc elections ) ఎన్నికలలో బీటలు బారే పరిస్థితి నెలకొంది . ఉద్యమ నేతలంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు . మొన్న ఈటల రాజేందర్ ( Eetala rajender ) టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి , ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి హుజురాబాద్ ఉప ఎన్నిక పోరుకు తెరలేపారు . టిఆర్ఎస్ ( TRS) పార్టీపై ప్రజల్లో ఉన్న అసమ్మతికి తోడు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని టీఆర్ఎస్పై ఘన విజయం సాధించారు .

  ఇప్పుడు తాజాగా నేడు అదే బాటలో  కరీంనగర్ ( karimnagar ) మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సైతం అసమ్మతి గళం విప్పారు . మంగళవారం కరీంనగర్ ఎమ్మెల్సీ (mlc elections ) స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు . సిఎం కేసిఆర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారని , జాబితాలో తన పేరు లేకపోవడంపై రవీందర్‌ సింగ్ అసహనం వ్యక్తం చేశారు . విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఒకింత కంటతడి పెట్టారు . తన అనుచరుల సలహాలు , సూచనలతో నామినేషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు . తామంతా ఉద్యమ నాయకులమని , పదవులు తమకు భిక్ష కాదని చెప్పుకొచ్చారు .

  ఇది చదవండి : ఎమ్మెల్సీ కవిత ఎన్నిక ఇక ఏకగ్రీవమే..? ఇండిపెండెండ్ అభ్యర్థి నామినేషన్‌లో వివాదం


  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ కాలంలో ఉన్న ముఖ్య నేతలు తరువాత కాలంలో కనుమరుగైయ్యారని గుర్తు చేశారు . మేయర్ పదవి కాలం ముగిసిన తర్వాత తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశపడ్డితే సొంత పార్టీ నేతలు అధిష్టానం వద్ద ప్రాధాన్యత లేకుండా చేశారని వాపోయారు . తన బాధను సిఎం కేసిఆర్ , మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించుకుందామంటే ఎమ్మెల్సీ స్థానల్లో పార్టీ ప్రకటించిన జాబితా కంటతడి పెట్టించినట్లు పేర్కొన్నారు .

  మొత్తం మీద రవీందర్ సింగ్ పరిణామంతో ఆ పార్టీలో ధిక్కార స్వరం పెరుగుతుండడంతో భవిష్యత్ పరిణామాలపై చర్చ మొదలైంది. సీఎంకు అతి సన్నిహితంగా ఉండే.. ఈటల రాజేందర్ విభేదించి బయటకు వచ్చి తాజాగా ఎమ్మెల్యేగా గెలుపొంది ఆపార్టీకే సవాల్ విసిరారు.. ఇప్పుడు కింది స్థాయిలో ఉండి, ఉద్యమ కాలం నుండి పార్టీకి అండగా ఉంటున్న వారికి కాదని అధికారం కొసం కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ఆపార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఇన్నాళ్లు సీఎం కేసిఆర్ ( cm kcr ) ఏలాంటీ నిర్ణయాలు తీసుకున్నా ఉన్నతస్థాయి నుండి కింది స్థాయి వరకు ఆయన నిర్ణయమే ఫైనల్ గా ఉండేది. ఒకవేళ అంతర్గతంగా విభేదాలు ఉన్నా బయటకు వచ్చే పరిస్థితి మాత్రం కనిపించలేదు. కాని ఈటల ఎపిసోడ్ తర్వాత కింది స్థాయి నాయకుల్లో కూడా అసమ్మతి గళం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మాజీ మేయర్ కూడా పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ ( nominations ) వేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆయన నామినేషన్ ఉప సంహరించుకునే పరిస్థతి కనిపించకపోయినా.. పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశాలు లేవు. అయితే పార్టీలో ఉన్న కొంత అసమ్మతి వర్గం తమకు అన్యాయం జరిగినప్పుడు స్వేచ్చగా బయటికి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Karimnagar, Mlc elections, Telangana

  ఉత్తమ కథలు