కారు గుర్తు కంటే గ్యాస్ బండనే హైలైట్ చేస్తూ.. Huzurabad ప్రచారంలో TRSకు ప్రధాన అస్త్రంగా మారిన Gas Cylinder

గ్యాస్ బండలతో టీఆర్ఎస్ ప్రచారం

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ప్రధానాస్త్రంగా మారింది. గ్యాస్ ధరలను విపరీతంగా పేచేస్తోన్న కేంద్రంలోని బీజేపీ సర్కారును అవహేళన చేస్తూ, ఈటలకు సవాళ్లు విసురుతూ గ్యాస్ బండల బొమ్మలతో టీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తున్నది. మంత్రి హరీశ్ రావు ప్రచారంలోనూ కారు గుర్తు కంటే గ్యాస్ బండ బొమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నాయి..

 • Share this:
  (P.Srinivas, news18, Karimnagar)
  హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో గ్యాస్ సిలిండర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచిందని టిఆర్ఎస్ పార్టీ తన ప్రచార సభల్లో దీనినే అస్త్రంగా మార్చుకోని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. మొన్నటి మొన్న ఇంటింటా బ్యానర్లు పెట్టి సిలిండర్, పెట్రోల్, ధరలు పెంచిన బీజేపీ పార్టీ మా ఇంటి ఓట్లు అడగడానికి రావద్దు. అని మా ఓట్లన్నీ టిఆర్ఎస్ పార్టీ వేస్తామంటూ ఝలక్ ఇచ్చారు. ఇంకా బతుకమ్మ పండగ రోజు కూడా గ్యాస్ సిలిండర్ను బతుకమ్మ మధ్యలో పెట్టి ఆడడం కూడావైరల్ గా మారింది.

  బిజెపి,పార్టీని నిదించాలంటే టీఆరెఎస్ కు గ్యాస్ సిలిండర్ వజ్రాయుధoగా మారిందని చెప్పుకోవచ్చు. టీఆరెస్ పార్టీ ప్రచార సభల్లో, ప్రచార వాహనల పై గ్యాస్ సిలిండర్లను పెట్టి ప్రచారం చేసుకుంటూ బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు . నాలుగు వందల నలభై రూపాయలు ఉన్న సిలిండర్ ధరను బిజెపి వెయ్యి రూపాయలు చేసిందని, ప్రతిరోజు ధరలు పెంచుకుంటూ పోతున్నారని, పెట్రోలు రూ. వంద దాటిందని డీజిల్ వంద రూపాయలు అయిందని, పండుగ అని కూడా చూడకుండా ప్రతిరోజు ధరలు పెంచడం బిజెపి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది అని మంత్రి హరీష్ రావ్ ప్రచార సభల్లో ప్రజలకు వివరిస్తున్నారు.

  Huzurabad: ఆ ఒక్క ఓటుతో కాంగ్రెస్ గెలుపు - నా ముందు KTR పిల్ల బచ్చా : Revanth reddy


  అయితే గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలపై టిఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ రావు బీజేపీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలపై ఇప్పటివరకు బిజెపి నాయకులు గానీ ఆ పార్టీ గాని స్పందించకపోవడం గమనార్హం. గ్యాస్ ధర లో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని మాజీ మంత్రి ఈటెల ఆరోపించారు. ఇది నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు.

  ఉపరాష్ట్రపతిగా KCR అసలు కథ ఇదే -ఓడిపోతే దుప్పటి కప్పుకోవాలా? Huzurabad చాలా చిన్న ఎన్నిక: మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు


  అయినప్పటికీ ఇప్పటి వరకు దీనిపై మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పటివరకు స్పందించలేదు. జీడీపీ (ఆర్థికాభివృద్ధి) తగ్గి.. జీడీపీ (గ్యాస్ పెట్రోల్ డిజిల్) ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని.. మంత్రి హరీష్ రావు బీజేపీ ప్రభుత్వానికి చురకలు అంటిస్తు ప్రచారం లో ముందుకు సాగుతున్నారు. మరి చూడాలి గ్యాస్ సిలిండర్ అయినా టిఆర్ఎస్ పార్టీని గట్టెక్కించేఉందా లేదా..
  Published by:Madhu Kota
  First published: